India’s Inventions : ఏంటీ ఇవన్నీ మన వాళ్లేనా కనిపెట్టింది..!
ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలలో చాలావరకు మన భారతదేశం నుంచే పుట్టుకొచ్చినవే. భారతీయుల ప్రతిభ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
భారతదేశం.. ఎన్నో వేదాలకు, ఉపనిశత్తులకు నిలయం.. ఆధునిక నాగరికతకు పునాదులు వేసిన నేలగా కూడా మన దేశాన్ని పరిగణించవచ్చు. ప్రాచీన కాలంలోనే భారత దేశం ఎన్నో అద్భుతాలను కనుగొన్నది. ఇలా మనదేశం నుంచి ప్రపంచానికి పరిచయం చేసిన వస్తువులు, విధానాలను మచ్చుకు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
నిత్యం మార్కెట్లో అనేక రకాల షాంపూలు చూస్తున్నాం కదా.. ఈ షాంపులు మొట్ట మొదట ఎప్పుడు కనుక్కొన్నారు, ఎవరు తయారు చేశారు అని ఎప్పుడైనా అనిపించిందా.. షాంపుని మొదట 1762లో మనదేశంలోనే కనిపెట్టారు. అప్పుడు మన దేశాన్ని మొగల్స్ పాలిస్తున్నారు. మొదటి షాంపుని మూలికలు, నూనెలను వాడి తయారు చేశారు. అప్పట్లో దీన్ని మసాజ్ చేసేందుకు వినియోగించేవారు.
అంకెలలో సున్నాకి ఉన్న ప్రత్యేకత మరే అంకెకు ఉండదు. అప్పట్లో సున్న చుక్క రూపంలో ఉండేది. ప్రాచీన కాలంలో మిగతా అంకెలతో పాటు చుక్క ఉండేది. ఇలా ఉన్న అంకెలు ఇండియాలో ఉన్న గ్వాలియర్ లోని ఆలయంలో కనిపిస్తుంది. ఆ చుక్కను సున్నాగా డెవలెప్ చేసింది మొదట హిందు గణిత శాస్త్ర నిపుణుడైన బ్రహ్మగుప్త. కానీ అతనే సున్నాని కనుగొన్నట్లు రుజువు చేసుకోలేదు అనే వాదనలు కూడా ఉన్నాయి.
వైద్యరంగంలో ఇప్పుడు అత్యంత ఆధునికతతో తయారైన పరికరాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కంటి వైద్యంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అయితే కంటి శుక్లాలను తొలగించే చికిత్స మొట్ట మొదట 3వ శతాబ్దంలోనే శుశ్రుతుడు చేశారు. కంటిపై వచ్చిన శుక్లాలను తొలగించేందుకు సూదిని వాడి సర్జరీ చేశారు. ఆ తరువాత పూర్తిగా నయమయ్యే వరకు వెచ్చని వెన్నని కంటిలో వేసి కట్టుకట్టినట్లు తెలుస్తోంది.
అలాగే అత్యంత భయంకరమైన కుష్టు వ్యాధికి మందు కూడా మన దేశంలోనే కనుక్కొబడింది. ఈ రోగానికి చికిత్స చేసే పద్దతి అథర్వ వేదంలో ఉంది. అప్పట్లో కుష్టు వ్యాధిగ్రస్తులకు మూలికల నుంచి తయారు చేసిన మందుని వాడి నయం చేసేవాళ్లు.
శరీరంతో పాటు మనస్సుని సక్రమంగా ఉంచే వ్యాయామం ఏమైనా ఉందా అంటే వెంటనే యోగా అని చెప్పేస్తారు. అయతే యోగా కూడా మన దేశం నుంచి పుట్టుకు వచ్చిందే.. యోగా అనేది సంస్కృత పదం. దీనికి మూల గురువుగా శివున్ని భావిస్తారు. అందుకే ఆయన్ని ఆది యోగి అని పిలుస్తారు. నాగరికత మొదలైనప్పటి నుంచే యోగా కూడా ఉంటుందని భావిస్తారు.
చదరంగం కూడా మన దేశంలోనే పుట్టింది. మొదట గుప్తుల కాలంలో కనిపెట్టారు. అప్పట్లో ఈ ఆటలో 64 గడులు ఉండేవి దీన్ని నలుగురు వ్యక్తులు ఆడేవారు.
ఇప్పుడు దుస్తుల్లో గుండీలు ఉండటం చాలా సహజం. మొట్ట మొదట వీటిని సింధూ నాగరికతలోనే కనుగొన్నారు. గవ్వలను డెకరేషన్‌ల కోసం వినియోగించేవారు. అదికాస్తా క్రమేపి బటన్స్‌లా అవతరించాయి.
పేపర్‌పై స్ట్రైట్ లైన్స్ గీయాలంటే వెంటనే గుర్తొచ్చేది స్కేల్.. ఆ స్కేల్‌ను కనిపెట్టింది కూడా భారతీయులే.. ఖచ్చితమైన దశాంశాలను కనుకునేందుకు వేల ఏండ్ల క్రితం ఏనుగుల దంతాలు, జంతువుల కొమ్ములతో లేదా చెక్కలతో తయారు చేసేసిన రూలర్స్‌ని వాడేవారు.
స్వచ్ఛమైన ఖద్దరు దుస్తులను కనిపెట్టింది కూడా భారత దేశమే.. 1800 బీసీఈ లోనే ఉన్ని, కద్దరును తయారు చేసేవారు. రాట్నంపై దారాన్ని ఉనికే పద్ధతిని కనుగొన్నారు. అంతకంటే ముందు గ్రీక్స్ జంతువుల చర్మాన్ని ధరించేవారు.
ఇందంతా ఒకెత్తు అయితే ఫ్లష్ టాయిలెట్ వ్యవస్థను కూడా మొదట సింధూనాగరికతలోనే కనుగొన్నారు. అప్పట్లో ప్రతి ఇంట్లో ఈ ఫ్లష్ టాయిలెట్ ఉండేవి. మురుగు నీటి వ్యవస్థ చాలా బాగుండేది. ఈ నాగరికతలో హైడ్రాలిక్ ఇంజనీరింగ్ వ్యవస్థ అడ్వాన్స్ లెవల్‌లో ఉండేది.
18వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని మైసూర్ కేంద్రంగా పరిపాలించిన టిప్పు సుల్తాన్ మొట్ట మొదట రాకెట్లను కనుగొన్నారు. మెటల్ కేస్డ్ సిలిండర్ రాకెట్స్ ను టిప్పు సుల్తాన్ అతని తండ్రి బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీకి వ్యతిరేకంగా వినియోగించారు.
డైమండ్ మైనింగ్ కూడా మొదట భారత దేశంలోనే మొదలైంది. 18వ శతాబ్ధం వరకు ప్రపంచ వ్యాప్తంగా కేవలం భారత దేశం మాత్రమే వజ్రాలకు నిలయంగా ఉండేది. ఆ తరువాత బ్రెజిల్‌లో కనుగొనడం మొదలు పెట్టారు.
ఇప్పుడు మనందరం డేటాను సేవ్ చేసుకునేందుకు వాడే యూఎస్‌బీని కూడా1996లో మన దేశానికి చెందిన అజయ్ భట్ కనుగొన్నారు. దీన్ని ఇంటెల్ కంపెనీతో కలిసి తయారు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram