దేశంలోని తొలి ఆల్గే చెట్టు…యాంత్రిక హరిత విప్లవం

భోపాల్‌లో దేశ తొలి ‘ఆల్గే ట్రీ’ ఏర్పాటు చేశారు. ఇది 25 చెట్ల పనితీరుతో సమానంగా పనిచేస్తూ కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తుంది.

మొక్కలు, చెట్లు వంటివన్ని సహజ సిద్దమైన ప్రకృతిలో జన్మించి మనుగడ సాగించేవే. అయితే ఆధునిక సాంకేతిక విజ్ఞానం అనేక రంగాల్లో తెచ్చిన మార్పుల మాదిరిగానే కృత్రిమ, హైబ్రిడ్ జంతువులను సృష్టించినట్లుగా
మొక్కలు, చెట్లను, వంగడాలను కూడా సృష్టిస్తున్నారు. తాజాగా పర్యావరణ హితమైన యాంత్రిక చెట్టును కూడా ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఆవిష్కృతం చేసింది.

భారతదేశంలో పర్యావరణ రక్షణకు మరో వినూత్న అడుగు పడింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి రూపొందించిన విప్లవాత్మక కార్బన్-క్యాప్చరింగ్ టెక్నాలజీ అయిన భారతదేశపు మొట్టమొదటి “ఆల్గే ట్రీ “ఆల్గే ట్రీ” (AlgaeTree) ఏర్పాటు చేశారు. స్వామి వివేకానంద పార్క్ (అశోక గార్డెన్)లో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సౌరశక్తితో పనిచేసే ప్రత్యేక వ్యవస్థ కార్బన్ డయాక్సైడ్ (CO₂) ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇది 20–25 పెద్ద పెద్ద చెట్ల పనితీరుతో సమానంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే PM2.5 కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతోంది. ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ యాంత్రిక చెట్టు భోపాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఆల్గే’అంటే వాడుక భాషలో పాచి(శైవలాలు). వీటితో ఏర్పడిన ఒక చెట్టునే ‘ఆల్గే ట్రీ’గా పిలుస్తారు. రెండు సంవత్సరాలపాటు 50మందికిపైగా పరిశోధకులు, సైంటిస్టులు, ఇంజనీర్లతో కలిసి మష్రూమ్‌ వ రల్డ్‌ గ్రూప్‌ ‘ఆల్గే ట్రీ’ పరికరాన్ని అభివృద్ధి చేసింది.

ఆల్గే చెట్టు ప్రత్యేకతలు: ఆల్గే ట్రీ కృత్రిమంగా కిరణజన్య సంయోగక్రియ జరిపి, గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఒక ఆల్గే ట్రీ దాదాపు 25 వయోజన చెట్లతో సమానంగా పనిచేసి కార్బన్‌ను గ్రహిస్తుంది. దీని చుట్టూ 15 మీటర్ల వ్యాసార్థంలో PM2.5 కాలుష్య కారకాలను 45% నుండి 55% వరకు తగ్గిస్తుంది. సౌరశక్తి (సోలార్ పవర్)తో పనిచేసే ఈ యాంత్రిక చెట్టులో పంపులు, సెన్సార్లు, ఎల్ఈడీ లైట్లు అమర్చబడి ఉంటాయి. హరిత ఆవిష్కరణకు ప్రోత్సహకంగా భావిస్తున్న ఆల్గే చెట్టుతో నగరాలను మరింత పచ్చగా, సుస్థిరంగా మార్చడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ప్రజ‌ల ప్రాణాల రక్షణే ప్రధాన బాధ్యత : మంత్రి పొంగులేటి
Tata Sierra EV | దూకుడు పెంచిన టాటా మోటార్స్.. సియారా ఈవీ లాంచ్ కన్ఫార్మ్.. మరో రెండు కొత్త మోడళ్లు కూడా!

Latest News