Crow | కాకులకు అన్నం వడ్డిస్తూ.. గొప్ప మనసు చాటుకుంటున్న పూజారి
Crows | కాకులు( Crows ) అంటే గుర్తొచ్చేది.. మనషులు చనిపోయాక పిండం పెట్టినప్పుడు.. కానీ ఈ పూజారి( Poojary )కి మాత్రం ప్రతి రోజు కాకులు గుర్తుకు వస్తాయి. కాకులను ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్న ఆయన.. ప్రతి రోజు మధ్యాహ్నం వాటికి అన్నం( Rice ) వడ్డించిన తర్వాతే.. హోటల్‌లో మనషులకు భోజనం( Meals ) వడ్డిస్తాడు.

Crow | ఒకప్పుడు గుంపులు గుంపులుగా కనిపించే కాకులు( Crows ) కనుమరుగు అవుతున్నాయి. భూమ్మీద ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట కనిపించినా.. అవి కూడా ఒకట్రెండు కనిపిస్తున్నాయి. కావ్ కావ్( Caw Caw ) మని అరిచే కాకులను కొందరు శుభప్రదంగా భావిస్తే, మరికొందరు అశుభంగా భావిస్తారు. అవి ఇంటి ముందు అరిచినా, ఇంట్లోకి వచ్చినా ఏదో చెడు జరుగుతుందని భావిస్తారు. కానీ కొందరు శుభప్రదంగా భావిస్తారు.
ఇతర పక్షులను( Birds ) ప్రేమించినట్టు కాకులను ప్రేమించరు. కనీసం వాటిని దగ్గరికి కూడా రానివ్వరు. భూమ్మీద దొరికే ధాన్యపు గింజలను తిని కాకులు బతికేస్తుంటాయి. అయితే కొంతమంది పక్షి ప్రేమికులు కాకులను కూడా తమ జాబితాలో చేర్చుకుంటారు. ఇతర పక్షులకు ఆహారం అందించినట్టే.. కాకులకు కూడా ఆహారాన్ని అందిస్తారు. అయితే ఈ జాబితాలో ఓ పూజారి( Poojary ) చేరాడు.
కర్ణాటక( Karnataka ) మంగళూరులోని బొక్కపట్న(Bokkapatna ) వద్ద ఉన్న అబ్కక్క క్వీన్ క్రూయిజ్ హోటల్(Abbakka Queen Cruise Hotel )లో పని చేస్తున్న జయ్ నారాయణ్ పూజారి( Jay Narayan Poojary ) కాకులను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మధ్యాహ్నం హోటల్‌లో భోజనం( Meals ) ప్రారంభమయ్యే సమయానికి ముందుగా కాకులకు ఆహారం పెడుతాడు. అన్నంతో పాటు రసం, ఇతర పదార్థాలను ఒక ప్లేట్‌లో ఉంచి కాకుల వద్దకు తీసుకెళ్తాడు. ఇక కాకులను హోటల్ వద్దకు రప్పించేందుకు ప్లేట్‌తో శబ్దం చేసేస్తాడు. ఇక క్షణాల్లోనే కాకులు అక్కడ వాలిపోతాయి. పూజారి అందించిన ఆహారం తిని అక్కడ్నుంచి మళ్లీ వెళ్లిపోతాయి.
ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ.. ప్రతి రోజు మధ్యాహ్నం ప్లేట్‌తో శబ్దం చేయగానే కాకులు వాలిపోతాయి. వాటికి ఆహారం అందించిన తర్వాతనే హోటల్‌లో మధ్యాహ్న భోజనం స్టార్ట్ చేస్తాము. ఓల్డ్ పోర్ట్‌లో తమ హోటల్ ఉన్నప్పట్నుంచి ఇది కొనసాగుతుందన్నారు. బొక్కపట్న వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నామని తెలిపాడు. పర్యావరణంలో పక్షులను ప్రేమించడం అలవాటు చేసుకోవాలన్నాడు. ప్రతి పక్షిని ప్రేమించాలని పూజారి చెప్పుకొచ్చాడు.