DGP RamaChandra Rao : సరసాల డీజీపీ అధికారిని సస్పెండ్ చేసిన కర్ణాటక సర్కార్
ఆఫీస్‌లో మహిళలతో అభ్యంతరకరంగా వ్యవహరించిన వీడియోలు వైరల్ కావడంతో కర్ణాటక డీజీపీ స్థాయి అధికారి కె. రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
విధాత : రాసలీల వీడియోల కేసులో ఇరుక్కున్న కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆఫీస్ లోనే పలువురు మహిళలతో అభ్యంతరకరమైన రీతిలో సన్నిహితంగా వ్యహరించిన రామచంద్రరావు వీడియోలు వైరల్ కావడంతో సీఎం సిద్దరామయ్య విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రామచంద్రరావు ప్రవర్తన శాఖపరమైన నిబంధనలను ఉల్లఘించిందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారు బిస్కెట్ల స్మగ్లింగ్ కేసులో దోషి, సినీనటి రన్యారావుకు రామచంద్రరావు సవతి తండ్రి కావడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
Saina Nehwal : రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. కారణం ఇదే..?
China Birth Rate : చైనాలో జనాభా సంక్షోభం.. భారీగా తగ్గిన జననాల రేటు.. 1949 తర్వాత ఇదే తొలిసారి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram