Tomato | కిలో టమాటా రూ. 250.. ఎక్కడంటే..?
Tomato విధాత: రోజురోజుకు టమాటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యులు టమాటాను కొనలేని పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనైనా కిలో టమాటా రూ. 120 పైనే పలుకుతోంది. అంతకు తక్కువ ఎక్కడా అమ్మడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కిలో టమాటా ధర రూ. 250కి చేరింది. ఉత్తరకాశీ జిల్లాతో పాటు గంగోత్రిధామ్ పట్టణంలోనూ ఇదే ధర పలుకుతోంది. యమునోత్రిలో రూ. 200 నుంచి రూ. 250 మధ్య కొనసాగుతోంది. దీంతో టమాటాను […]

Tomato
విధాత: రోజురోజుకు టమాటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యులు టమాటాను కొనలేని పరిస్థితి దాపురించింది. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనైనా కిలో టమాటా రూ. 120 పైనే పలుకుతోంది. అంతకు తక్కువ ఎక్కడా అమ్మడం లేదు.
తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో కిలో టమాటా ధర రూ. 250కి చేరింది. ఉత్తరకాశీ జిల్లాతో పాటు గంగోత్రిధామ్ పట్టణంలోనూ ఇదే ధర పలుకుతోంది. యమునోత్రిలో రూ. 200 నుంచి రూ. 250 మధ్య కొనసాగుతోంది.
దీంతో టమాటాను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఉత్తరాఖండ్‌లోని మిగతా ప్రాంతాల్లో కిలో రూ. 180 నుంచి రూ. 200 దాకా ఉంది. అయితే టమాటా పండించే కీలక ప్రాంతాల్లో వేడిగాలులు, భారీ వర్షాల కారణంగా ధరలు మండిపోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక బెంగళూరులో రూ. 101 నుంచి రూ. 121, కోల్‌కతాలో రూ. 152, న్యూఢిల్లీలో రూ. 120, చెన్నైలో రూ. 117, ముంబైలో రూ. 108, ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో రూ. 162 పలికింది. రాజస్థాన్‌లోని చురులో అత్యల్పంగా కిలో టమాటా రూ. 31కే విక్రయిస్తున్నారు.