Beggar | షాకింగ్.. బిచ్చగాడి వద్ద రూ.4 లక్షల నగదు.. రద్దు చేసిన, విదేశీ కరెన్సీ లభ్యం
కేరళ (Kerala) రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ యాచకుడి వద్ద ఏకంగా రూ.4 లక్షల నగదు లభ్యమైంది.
అతనో బిచ్చగాడు (Beggar).. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరచూ కడుపు నింపుకునేందుకు రోడ్లపై యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఉన్నట్టుండి రోడ్డు ప్రమాదంలో
అతడు మరణించడంతో.. ఓ షాకింగ్ విషయం బయటపడింది. ఆ బిచ్చగాడి వద్ద రూ.లక్షల్లో నగదు బయటపడటంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ ఘటన కేరళ (Kerala) రాష్ట్రంలో వెలుగులోకి
వచ్చింది.
అనిల్ కిశోర్ అనే వ్యక్తి అలప్పుజా (Alappuzha)లో బిచ్చం ఎత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆ ప్రాంత ప్రజలకు ఆ యాచకుడు సుపరిచితమే. నిత్యం రోడ్లపై బండ్లు, కార్ల వద్దకు వెళ్లి పొట్ట కూటికోసం
బిచ్చమెత్తుకుంటూ తిరిగేవాడు. సడెన్‌గా సోమవారం రాత్రి జరిగిన ఓ ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అతని బాడీ వద్ద ఓ కంటేనర్‌ను అధికారులు గుర్తించారు. పరిశీలన కోసం దాన్ని స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దాన్ని లెక్కించగా.. ఏకంగా రూ.4.5 లక్షలు ఉన్నట్లు తేలింది.
ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదులో రద్దైన రూ.2వేల నోట్లు ఉన్నాయి. వాటితోపాటూ కొంత ఫారెన్ కరెన్సీ (Foreign Currency) కూడా గుర్తించారు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల ప్రజల షాక్ అయ్యారు. తిండి కోసం కిశోర్ డబ్బులు యాచించేవాడని స్థానికులు తెలిపారు. కానీ, అతడి వద్ద ఇంత డబ్బు ఉన్నవిషయం తమకు తెలియదన్నారు. మరోవైపు స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో జమ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Anaganaga Oka Raju TRAILER | అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్.. నవ్వులు మాములుగా లేవుగా..!
Budget 2026 | కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1నే ఎందుకు..? ఎప్పుడు మార్చారు..?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram