Anaganaga Oka Raju TRAILER | అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్.. న‌వ్వులు మాములుగా లేవుగా..!

Anaganaga Oka Raju TRAILER | టాలీవుడ్‌లో యూత్ ఆడియన్స్‌కు ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యే హీరోలలో నవీన్ పొలిశెట్టి ముందువరుసలో నిలిచిన సంగతి తెలిసిందే. తనదైన సహజ నటన, చురుకైన డైలాగ్ డెలివరీతో కామెడీకి కొత్త డైమెన్షన్ తీసుకొచ్చిన నవీన్, ఇప్పుడు మరోసారి పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

  • By: sn |    movies |    Published on : Jan 08, 2026 1:02 PM IST
Anaganaga Oka Raju TRAILER | అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్.. న‌వ్వులు మాములుగా లేవుగా..!

Anaganaga Oka Raju TRAILER | టాలీవుడ్‌లో యూత్ ఆడియన్స్‌కు ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యే హీరోలలో నవీన్ పొలిశెట్టి ముందువరుసలో నిలిచిన సంగతి తెలిసిందే. తనదైన సహజ నటన, చురుకైన డైలాగ్ డెలివరీతో కామెడీకి కొత్త డైమెన్షన్ తీసుకొచ్చిన నవీన్, ఇప్పుడు మరోసారి పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతను లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తిని పెంచేస్తోంది. మారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మక కథతో సాగనుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. సంక్రాంతి వేళ కుటుంబమంతా కలిసి చూసేలా కథ, కథనం ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం. అందుకే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

పండగ వాతావరణానికి తగ్గట్టుగా సినిమాను ప్రమోట్ చేస్తూ, “ఈ సంక్రాంతికి నవ్వుల పండగ” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రచారం చేస్తున్నారు. ఈ మూవీలో నవీన్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించడం మరో హైలైట్‌గా మారింది. వీరిద్దరి కలయిక తొలిసారి కావడంతో, స్క్రీన్‌పై ఫ్రెష్ ఎనర్జీ కనిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో బైట్స్‌లో నవీన్–మీనాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్‌కు మీనాక్షి పాత్ర మంచి బ్యాలెన్స్ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. రోజువారి జీవితానికి దగ్గరగా ఉండే సంఘటనలను వినోదాత్మకంగా చూపించిన తీరు ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుంది.

నవీన్ డైలాగ్‌లు, సిట్యుయేషనల్ కామెడీ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కామెడీ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. టెక్నికల్‌గా కూడా సినిమాకు మంచి విలువలు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. మొత్తంగా, నవీన్ పొలిశెట్టి ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆస్వాదించేలా రూపొందుతున్న ‘అనగనగా ఒక రాజు’ ఈ సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టిస్తుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.