స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్‌ ధోనీ..!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్‌ ధోనీ..!

మహేంద్ర సింగ్‌ ధోనీ. పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మిస్టర్‌ కూల్‌.. దేశానికి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. ప్రస్తుతం క్రికెట్‌ దూరంగా ఉన్న మాజీ కెప్టెన్‌ను దేశానికి చెందిన ప్రముఖ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది.


ఒత్తిడిలోనూ ధోని కూల్‌గా ఉంటారని, స్పష్టంగా ఆలోచించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పింది. ఎస్‌బీఐకి ధోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండడం సంతోషకరమని, బ్యాంకు వినియోగదారులకు మరింత చేరువ చేస్తారని ఆశిస్తున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంక్‌ పేర్కొంది. రాబోయే రోజుల్లో బ్యాంక్‌ మార్కెటింగ్‌, ప్రొమోషన్‌లో మిస్టర్‌ కూల్‌ కీలకపాత్ర పోషిస్తారని ఎస్‌బీఐ తెలిపింది.


అయితే, కస్టరమర్లతో మరింత లోతైన సంబంధాలను ఏర్పరుచుకునేందుకు బ్యాంక్‌ కృషి చేస్తుందని.. విలువలతో పాటు నాయకత్వ లక్షణాలకు ప్రాధాన్యం ఇస్తుందనడానికి ధోనీ ఎంపికే నిదర్శనమని చెప్పింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా మాట్లాడుతూ.. ఎస్‌బీఐ బ్రాండ్‌కు ధోనీ సరిగ్గా సరిపోతారని, ఖాతాదారుల్లో మరింత నమ్మకం పెరుగుతుందని తెలిపారు. భారతీయులతో నమ్మకంగా కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న ఆయన.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.