Marriage with Deceased Fiancee | ప్రేమకు మరణం లేదు.. ప్రియురాలి మృతదేహాంతో ప్రియుడు పెళ్లి
Marriage with Deceased Fiancee | ప్రేమ( Love )కు మరణం లేదు.. దానికి ఓటమి లేనే లేదు.. అది ఓడి గెలుచుకుంటుంది.. చావులోన బ్రతికుంటుంది.. అనే దానికి ఈ హృదయవిదారక ఘటనే నిదర్శనం.

Marriage with Deceased Fiancee | ప్రేమ( Love )కు మరణం లేదు.. దానికి ఓటమి లేనే లేదు.. అది ఓడి గెలుచుకుంటుంది.. చావులోన బ్రతికుంటుంది.. అనే దానికి ఈ హృదయవిదారక ఘటనే నిదర్శనం. మనసారా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించారు.. త్వరలోనే పెళ్లి( Marriage ) పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే ప్రియురాలు ఆత్మహత్య( Lover Suicide ) చేసుకోవడంతో.. ఆమె మృతిని తట్టుకోలేకపోయాడు ప్రియుడు( Boy Friend ). చివరకు ప్రియురాలి మృతదేహాంతో పెళ్లి చేసుకుని, ఆమె చితికి నిప్పంటించి తన ప్రేమను చాటుకున్నాడు ప్రియుడు. ఈ గొప్ప ప్రేమకథ( Love Story ) ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది.
ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని మహారాజ్‌గంజ్ జిల్లాలోని నీచ్‌లాల్ పట్టణానికి చెందిన సన్నీ(25).. స్థానికంగా ఉన్న ప్రియాంక(24) అనే యువతిని గత కొన్నేండ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. మనసారా ప్రేమించుకున్న వీరిద్దరూ మనువాడాలనుకున్నారు. కానీ మొదట వీరి ప్రేమపెళ్లిని పెద్దలు ప్రతిఘటించారు. కొన్నాళ్లకు ఇరు కుటుంబాలు మనసులు మార్చుకున్నాయి. ఇటీవలే సన్నీ, ప్రియాంకకు ఎంగేజ్‌మెంట్ నిర్వహించారు. ఇక ఐదు నెలల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి.
కానీ ఆదివారం ఉదయం ప్రియాంక తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. తన గదిలో విగతజీవిగా పడి ఉన్న ప్రియాంకను చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. ప్రియుడు సన్నీ బోరున విలపించాడు. పెద్దల అంగీకారంతో ప్రియురాలి నుదుటిపై సింధూరం పెట్టి పెళ్లి చేసుకున్నాడు. పాడేపై ఉన్న ప్రియురాలి మృతదేహానికి సింధూరం పెట్టి పెళ్లి చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. సన్నీ దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. తన ప్రేమను చాటుకున్నాడు. అంతేకాదు చివరకు ప్రియురాలి చితికి తానే నిప్పంటించి.. ఓ గొప్ప ప్రేమికుడిగా మిగిలిపోయాడు.
అయితే ప్రియాంక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.