MBBS Student assault | వైద్య విద్యార్థినిపై లైంగికదాడి.. వీడియోలతో బ్లాక్ మెయిల్
MBBS Student assault | దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ వైద్య విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

MBBS Student assault | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ వైద్య విద్యార్థినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి వేధింపులు తాళలేక.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన ఓ యువతి(18).. ఢిల్లీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే ఆమె స్నేహితుడు(20) ఒకరు.. పార్టీ ఉందని చెప్పి సెప్టెంబర్ 9వ తేదీన ఢిల్లీలోని ఓ హోటల్‌కు పిలిపించాడు. అక్కడ తన ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఆమెకు కూడా బలవంతంగా మద్యం తాగించారు.
అనంతరం ఆమెపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇద్దరు స్నేహితులు ఈ దాడిని ఫోన్‌లో చిత్రీకరించారు. ఇక ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని, యువకుడు పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. సహకరించకపోతే ఈ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో అతని వేధింపులు తాళలేక చివరకు తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.