Mother Molest | వివాహేత‌ర సంబంధానికి శిక్ష‌గా.. 65 ఏండ్ల త‌ల్లిపై కుమారుడి లైంగిక‌దాడి..

Mother Molest | దేశ రాజ‌ధాని ఢిల్లీ( Delhi ) న‌గ‌రంలో ఓ యువ‌కుడు( Youth ) దారుణానికి పాల్ప‌డ్డారు. న‌వ మాసాలు మోసి క‌నిపెంచిన త‌ల్లిపైనే లైంగిక‌దాడికి( Mother Molest ) పాల్ప‌డ్డాడు. ఓ గ‌ది నిర్బంధించి ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు కుమారుడు.

Mother Molest | వివాహేత‌ర సంబంధానికి శిక్ష‌గా.. 65 ఏండ్ల త‌ల్లిపై కుమారుడి లైంగిక‌దాడి..

Mother Molest | న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ( Delhi ) న‌గ‌రంలో ఓ యువ‌కుడు( Youth ) దారుణానికి పాల్ప‌డ్డారు. న‌వ మాసాలు మోసి క‌నిపెంచిన త‌ల్లిపైనే లైంగిక‌దాడికి( Mother Molest ) పాల్ప‌డ్డాడు. ఓ గ‌ది నిర్బంధించి ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు కుమారుడు.

వివ‌రాల్లోకి వెళ్లే.. ఢిల్లీలోని హౌజ్ ఖాజీ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఓ 65 ఏండ్ల మ‌హిళ త‌న భ‌ర్త‌, కుమారుడు, కుమార్తెతో క‌లిసి ఉంటుంది. భ‌ర్త‌, కూతురితో క‌లిసి స‌దరు మ‌హిళ జులై 17న సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఆ స‌మ‌యంలో కుమారుడు తండ్రికి ఫోన్ చేసి ఢిల్లీకి వీలైనంత త్వ‌ర‌గా తిరిగి రావాల‌ని ఆదేశించాడు. అమ్మ‌కు విడాకులు ఇవ్వాల‌ని.. త‌న చిన్న‌త‌నంలో ఆమె వివాహేత‌ర సంబంధాలు కొన‌సాగించింద‌ని కుమారుడు తండ్రికి చెప్పాడు.

ఇక ఆగ‌స్టు 1వ తేదీన సౌదీ నుంచి ఆమె త‌న భ‌ర్త‌, కూతురితో క‌లిసి ఢిల్లీకి తిరిగి వ‌చ్చారు. అదే రోజు రాత్రి త‌ల్లిని ఓ గ‌దిలో నిర్బంధించి.. బుర్ఖా తొల‌గించ‌మ‌ని ఆదేశించాడు. ఇక విచ‌క్ష‌ణార‌హితంగా త‌ల్లిని కొట్టాడు. త‌న జీవితాన్ని నాశ‌నం చేశావంటూ త‌ల్లిని దూషించాడు. దీంతో ఆవిడ త‌న పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లి త‌ల‌దాచుకుంది. మ‌ళ్లీ ఆగ‌స్టు 11వ తేదీన తిరిగి త‌న ఇంటికి చేరుకుంది.

ఆ రోజు రాత్రి 9.30 గంట‌ల స‌మ‌యంలో త‌న త‌ల్లితో ఒంట‌రిగా మాట్లాడాల‌ని చెప్పి ఓ గ‌దిలో ఆమె నిర్బంధించాడు. ఆమెను దూషిస్తూ లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. గ‌తంలో వివాహేత‌ర సంబంధం కొన‌సాగించినందుకు శిక్ష‌గా లైంగిక‌దాడికి పాల్ప‌డుతున్న‌ట్లు కొడుకు చెప్పాడు. మ‌ళ్లీ ఆగస్టు 14వ తేదీన కూడా త‌ల్లిపై అత్యాచారం చేశాడు. దీంతో మ‌రుస‌టి రోజు త‌న చిన్న కుమార్తె స‌హాయంతో హౌజ్ ఖాజీ పోలీసుల‌కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.