ఆర్భాటాలకు స్వస్తి.. నిరాడంబర జీవితమే నిజమైన సంపద!

ఆర్భాటాలకు దూరంగా పొదుపు, పెట్టుబడులు, ఆరోగ్యం, కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యం ఇస్తూ బెంగళూరుకు చెందిన మేఘా–శుభమ్ జంట సింపుల్ లైఫ్‌స్టైల్‌తో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

బెంగళూరుకు చెందిన ఓ జంట తమ సింపుల్ లైఫ్‌స్టైల్‌తో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఖరీదైన కార్లు, బ్రాండెడ్ వస్తువులకు దూరంగా ఉంటూ భవిష్యత్తు కోసం పొదుపు చేయడం, క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం, అవసరమైన ఖర్చులకే ప్రాధాన్యమివ్వడం తమ జీవన విధానంగా కొనసాగిస్తున్నామని మేఘా- శుభమ్ జంట ఓ వీడియోలో వెల్లడించింది.

వారి జీవన విధానాలలో… కుటుంబ పర్యటనల ద్వారా జ్ఞాపకాలకు ప్రాధాన్యత ఇవ్వడం, భవిష్యత్తు వైద్య ఖర్చులను తగ్గించుకోవడానికి ఫిట్‌నెస్ మరియు ఆరోగ్య పోషణలో పెట్టుబడి పెట్టడం, ప్రతి సంవత్సరం ఆర్థిక భద్రత పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలను పెంచుకోవడం, నాణ్యమైన గృహాన్ని ఎంచుకోవడం, మేఘా స్థిర ఖర్చులను చూసుకుంటుండగా, శుభమ్ చర ఖర్చులను నిర్వహిస్తూ బిల్లులను పంచుకోవడం వంటివి ఉన్నాయి.

“ఆర్భాటాల్లో కంటే.. మనశ్శాంతి, ఆర్థిక భద్రత, కుటుంబంతో గడిపే క్షణాల్లోనే నిజమైన సంపద, ఆనందం ఉంది” అని ఆ జంట స్పష్టం చేసింది. వారి ఆలోచన నేటి యువతకు కొత్త దిశ చూపిస్తోంది. కుటుంబ అనుబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాల ముఖ్యమని తెలిపింది.

మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా కొనసాగుతున్న నేటి సమాజానికి, ఆడంబర జీవన శైలితో ఆర్థిక భారం మోస్తున్న వారికి ఆ జంట లైఫ్ స్టైల్ ఆదర్శనీయంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Latest News