సిరులు కురిపిస్తున్న బంతి పూల సాగు..హెక్టార్ కు 1.80లక్షల ఆదాయం

బంతిపూల సాగుతో ఒడిశా రైతు సిరులు కురిపిస్తున్నాడు. హెక్టారుకు రూ.1.80 లక్షల ఆదాయం ఆర్జిస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచాడు.

సిరులు కురిపిస్తున్న బంతి పూల సాగు..హెక్టార్ కు 1.80లక్షల ఆదాయం

విధాత: సాంప్రదాయా సాగు విధానాలకు ఆధునిక సాగు పద్దతులను జోడిస్తే అధిక దిగుబడులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకోవచ్చు అని రైతులు తమ విజయగాథలతో నిరూపిస్తున్నారు. తాజాగా ఒడిస్సా కటక్ లోని నిశ్చింతకోయిలికి చెందిన ఓ రైతు బంతిపూల సాగును సిరుల పంటగా మార్చుకి ఏటా లక్షల ఆదాయం గడిస్తున్న తీరు రైతాంగానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.

కటక్‌లోని నిశ్చింతకోయిలికి చెందిన ఒక రైతు తన 6 ఎకరాల భూమిలో బంతిపూలను సాగు చేస్తూ, ప్రతిరోజూ 9-10 క్వింటాళ్ల పూలను ఉత్పత్తి చేస్తున్నారు.హెక్టారుకు సంవత్సరానికి రూ.1.5-1.8లక్షల నికర ఆదాయం ఆర్జిస్తున్నాడు. పంటల మార్పిడిలో భాగంగా రైతులు సంప్రదాయ పంటల సాగుకు మాత్రమే పరిమితం కాకుండా..మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పూల సాగుకు మారి..తన ఆదాయాన్ని అభివృద్ది చేసుకున్నట్లుగా రైతు వెల్లడించారు. అలాగే బంతిపూల సాగులో స్మార్ట్ ఫార్మింగ్ తో మంచి దిగుబడులు పొందుతున్నానని తెలిపారు. బంతి పూల పంటకాలం తక్కువ కావడం, దిగుబడులు త్వరగా రావడంతో ఏడాదిలో పలుమార్లు పండించడం కూడా కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు.

దేశంలో బంతిపూలు ఒక లాభదాయకమైన వాణిజ్య పంటగా కొనసాగుతుంది. తక్కువ పెట్టుబడితో పండించే బంతిపూల సాగు చిన్న రైతులకు ఎంతో ప్రయోజనకరంగా కొనసాగుతుంది. దేశంలో పండుగలు, పెళ్లిళ్లు, దేవాలయాలలో, ఇతర వేడుకలలో అలంకరణలకు బంతిపూలకు ఉన్న డిమాండ్ రైతులకు కలిసి వస్తుంది. మార్కెట్ ను గమనిస్తూ..సీజన్ లో ఉండే డిమాండ్ ను గుర్తించి ఆ సమయానికి దిగుబడులు వచ్చేలా బంతిపూల సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చని రైతులు సూచిస్తున్నారు. పూల పంట కావడంతో ప్రతిరోజూ కోత తీసుకుని అమ్మే అవకాశం ఉంటుంది.రోజుకు 9–10 క్వింటాళ్ల పూలను అమ్మితే, కిలోకు రూ.20నుంచి 40 మధ్య ధర ఉన్నా కూడా రోజుకు సుమారు రూ.18,000 నుంచి రూ.40,000 వరకు స్థూల ఆదాయం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Kajol | మూడు దశాబ్దాల తర్వాత ‘నో కిస్సింగ్’ నియమాన్ని ఉల్లంఘించిన‌ కాజోల్… కారణం ఇదే!
Viral Video | హోట‌ల్‌లో మూడు రోజులు బ‌స‌.. ట‌వ‌ల్స్, స్పూన్స్‌ను దొంగిలించిన టూరిస్టులు.. వీడియో