Odisha farmer | ఆలోచన అదుర్స్.. ఆదాయం డబుల్.. వ్యవసాయంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్న రైతన్న
ఒడిశాలోని సుందర్‌గఢ్ (Sundargarh)కు చెందిన ఓ రైతు (Odisha farmer) పంట సాగులో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాడు. తన చేపల చెరువై ట్రెల్లిస్ (trellis) నిర్మించి తీగ జాతికి చెందిన కూరగాయలు పండిస్తూ డబుల్ ఆదాయాన్ని అర్జిస్తున్నాడు.
Odisha farmer | సాంప్రదాయ పంటలు పండిస్తూ.. నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు ఇప్పుడు సరికొత్త ఆవిష్కరణల వైపు మళ్లుతున్నారు. వినూత్న పద్ధతిలో పంట సాగుచేస్తూ లాభాలను అర్జిస్తున్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యంకానిదంటూ ఏదీ ఉండదని నిరూపిస్తున్నారు. మట్టిలో కూడా బంగారాన్ని పండించొచ్చు అని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అందుకు నిదర్శనమే ఈ రైతు.
వ్యవసాయంలో సరికొత్త ఒరవడి
ఒడిశాలోని సుందర్‌గఢ్ (Sundargarh)కు చెందిన ఓ రైతు (Odisha farmer) పంట సాగులో వినూత్న ఆలోచన చేశారు. తన చేపల చెరువుపై ట్రెల్లిస్ (trellis)ను నిర్మించి తీగ జాతి కూరగాయలను పండిస్తున్నారు. ఒకే స్థలంలో పైన కూరగాయలు పండిస్తూ, కింద చేపలు పెంచుతూ రెట్టింపు ఆదాయాన్ని అర్జిస్తున్నారు. ఈ సమన్వయ సాగు విధానంతో ఆ రైతు భూమిని తెలివిగా వాడుకుంటూ వ్యవసాయంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అంతేకాదు, ఉన్న కొంత భూమినే తెలివిగా వాడుకుంటూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టుదలతో ముందుకు వెళ్తే సాధ్యంకానిదంటూ ఏదీ ఉండదని రైతాంగానికి చాటి చెబుతున్నాడు.
ఎక్కువ ఆదాయం.. మెరుగైన భూ వినియోగం
ఇందుకు సంబంధించిన వీడియోని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ రైతు గురించి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో షేర్ చేసిన నెటిజన్.. స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ = ఎక్కువ ఆదాయం + మెరుగైన భూ వినియోగం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ రైతు ఐడియాకు అందరూ ఫిదా అవుతున్నారు. మంచి ఆలోచన అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Meet a farmer from Sundargarh, Odisha who is reimagining farming!
Instead of traditional fields, he built a trellis system over his pond to grow climbing vegetables like bottle gourd, while practicing fish farming below.
Smart integrated farming = more income + better land use. pic.twitter.com/lq49jGyHj4
— Manas Muduli (@manas_muduli) February 13, 2026
ఇవి కూడా చదవండి :
Revanth Reddy| ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Rythu Bharosa : ఈ నెల 17 లేదా 18వ తేదీ నుంచి..రైతుల ఖాతాల్లో భరోసా సొమ్ములు..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram