ఒడిశాలో మరో రైలు ప్రమాదం

విధాత: ఒడిశాలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. షాలిమార్ సంబల్‌పూర్ ఎక్స్ ప్రెస్ రైలు గురువారం పట్టాలు తప్పింది. రైలు జనరల్ కంపార్టమెంట్ చివరి బోగీ పట్టాలు తప్పింది. అప్పటికే అందులోని ప్రయాణికులు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.
రైల్వే అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని బోగీని వేరుచేసి మరమ్మతులు చేయించారు. ఇతర రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.