ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు కేంద్రం షాక్.. షోకాజ్ నోటీసులు జారీ..!

విధాత: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పన్నుల చెల్లింపులో సీరియర్‌గా వ్యవహరిస్తున్నది. క్యాసినో డెల్టా కార్ప్‌తో పాటు డ్రీమ్11, గేమ్స్‌క్రాఫ్ట్ సహా అనేక ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు ప్రభుత్వం గత నెలలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పన్ను ఎగవేత ఆరోపణలపై పలు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు రూ.1లక్ష కోట్ల విలువైన నోటీసులు ఇచ్చినట్లు రాయిటర్స్ పేర్కొంది. అక్టోబర్ ఒకటి నుంచి భారత్‌లో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీల డేటా ఇంకా తేల్చాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు.
దేశంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న 100 కంటే ఎక్కువ ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్‌లు.. దాదాపు రూ.లక్షకోట్లకుపైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ ఇంటిలిజెన్స్ (DGGI) నిశితంగా గమనించిన అనంతరం షోకాజ్ నోటీసులు పంపినట్లు సమాచారం. అయితే, ఇదే కారణంతో గతవారం డెల్టాకార్ప్‌కి సైతం రూ.6,384 కోట్లకు సంబంధించి జీఎస్‌టీ నోటీసులు అందింది. కంపెనీపై ఉన్న మొత్తం పన్ను డిమాండ్ రూ.23వేలకోట్లకు పెరిగింది. రూ.21వేలకోట్ల జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై గతేడాది సెప్టెంబర్‌లో గేమ్స్‌క్రాఫ్ట్‌కి సైతం నోటీసు జారీ చేసింది.
అయితే, దీనిపై గేమ్స్‌క్రాఫ్ట్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. 28శాతం జీఎస్టీ విధించడంపై మేలో కర్నాటక హైకోర్టు నుంచి అనుకూలమైన తీర్పును గేమ్స్‌క్రాఫ్ట్ పొంది. డీజీజీఐ జారీ చేసిన రూ.20వేలకోట్లపైగా నోటీసును రద్దు చేసింది. అయితే, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలపై 28శాతం జీఎస్టీపై సుప్రీంకోర్టులో త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నది. అయితే, ఆయా కంపెనీలకు ఆడిట్ చేసిన వివరాలపై ప్రకారం.. రిటర్నులను పరిశీలించిన అనంతరం జీఎస్టీ అధికారులు నోటీసులు పంపారు. జీఎస్టీ రిటర్న్‌ల మొదటి ఆడిట్ తర్వాత నోటీసులు ఆటో తయారీదారులు, బీమా కంపెనీలకు కూడా నోటీసులు వెళ్లాయి.
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లపై 28శాతం జీఎస్టీ విధించడంపై వివాదం నెలకొన్నది. అయితే రంగాల జీఎస్టీ స్లాబ్‌ను నిర్ధారించేందుకు ప్రభుత్వం చట్టాలను సైతం వరించగా. అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్ ఈ ఏడాది జులై, ఆగస్టులో వరుస సమావేశాలు నిర్వహించింది. జీఎస్టీ చట్టాలకు సవరణలు చేసి ఆన్‌లైన్స్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై ట్యాక్స్‌లు వేసింది. ఈ నిర్ణయాలను అమల్లోకి తేవడానికి కిందటి పార్లమెంట్‌లోనూ జీఎస్టీ సవరణలకు ఆమోదం తెలిపింది.