గుట్టల కొద్దీ నోట్ల కట్టలు! ఈడీ రైడ్స్‌.. 8 మిషన్లతో 16 గంటలు లెక్కింపు

గేమింగ్ యాప్‌తో స్కామ్… నిందితుల ఇళ్లలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు విధాత‌, కోల్‌కతా: మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ ప్రమోటర్లపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టగా.. ఓ వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటప డుతూనే ఉన్నాయి. కోల్‌కతాలోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు ఇప్పటివరకు రూ.17కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదును చూసిన అధికారులు ఒకింత షాకు గురయ్యారు. కొన్ని ఆస్తి పత్రాలను కూడా వారు […]

  • By: Somu    crime    Sep 11, 2022 7:58 AM IST
గుట్టల కొద్దీ నోట్ల కట్టలు! ఈడీ రైడ్స్‌.. 8 మిషన్లతో 16 గంటలు లెక్కింపు
  • గేమింగ్ యాప్‌తో స్కామ్…
  • నిందితుల ఇళ్లలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు

విధాత‌, కోల్‌కతా: మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ ప్రమోటర్లపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టగా.. ఓ వ్యాపారి ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటప డుతూనే ఉన్నాయి.

కోల్‌కతాలోని ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు ఇప్పటివరకు రూ.17కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదును చూసిన అధికారులు ఒకింత షాకు గురయ్యారు. కొన్ని ఆస్తి పత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.

మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ ప్రమోటర్లపై పశ్చిమ బెంగాల్లో కేసులు నమోదు కాగా.. కోల్‌కతాకు చెందిన ఆమిర్ ఖాన్ అనే వ్యాపారి ఇల్లు సహా ఆయనకు సంబంధించిన ఆరు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి తనిఖీలు జరుపుతుండగా.. బ్యాంకు అధికారులు కూడా వారి వెంట ఉన్నారు.

భారీగా డబ్బు బయట పడటంతో కౌంటింగ్ యంత్రాలను తెప్పించుకొని డబ్బును లెక్కిస్తున్నారు. సాయంత్రం వరకు రూ.17కోట్లను వారు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. చీకటి పడ్డాక సైతం అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో ఆ వ్యాపారి ఇంటి వద్ద కేంద్ర బలగాలను మోహరించారు.