Lok Sabha Elections | ఆరో దశలో 58.98 శాతం పోలింగ్ నమోదు.. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆరు దశల ఎన్నికలు నేటితో ముగిశాయి. ఇక మిగిలింది చివరి దశ మాత్రమే. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, నేటి వరకు 486 సీట్లకు ఎన్నికలు జరిగాయి.
Lok Sabha Elections | న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆరు దశల ఎన్నికలు నేటితో ముగిశాయి. ఇక మిగిలింది చివరి దశ మాత్రమే. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, నేటి వరకు 486 సీట్లకు ఎన్నికలు జరిగాయి.
ఆరో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 6 వరకు క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
ఈ విడతలో హర్యానలో ఉన్న మొత్తం 10 స్థానాలకు, ఢిల్లీలో ఉన్న మొత్తం 7 సీట్లకూ ఎన్నిక జరిగింది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి ఈ విడతలోనే ఎన్నిక జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, బిహార్ 8, పశ్చిమ బెంగాల్ 8, ఒడిశా 6, ఝార్ఖండ్ 4 స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఈ దశలో 58.98 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 78 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా బీహార్‌లో 53.19 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరగ్గా.. 54.37 శాతం పోలింగ్ నమోదైంది. హర్యానాలో 58.24 శాతం, ఒడిశాలో 59.92 శాతం, జార్ఖండ్‌లో 62.66 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 54.03 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ – రాజౌరి నియోజకవర్గంలో 51 శాతం పోలింగ్ నమోదైంది. 1989 తర్వాత ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు.
శనివారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బీజేపీ నేత గౌతం గంభీర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఓటేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram