8 Civilians Killed In POK Protest | పాక్ బలగాల కాల్పులు.. పీవోకేలో 8 మంది మృతి
పాక్ బలగాల కాల్పుల్లో పీవోకేలో 8 మంది పౌరులు మృతి, పలువురికి గాయాలు, కశ్మీర్, బలూచిస్తాన్ పరిస్థితి విషమం.

న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతుున్నాయి. నిరసనకారులపై బుధవారం పాక్ బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 8మంది పౌరులు మృతి చెందారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికుల ఆందోళనలు ఉదృతం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులపై పాక్ బలగాలు జరిపిన కాల్పులలో 8 మంది మృతి చెందగా. పలువురికి గాయాలైనట్లుగా సమాచారం.
అటు బలుచిస్తాన్ ఫ్రావిన్స్ లో సైతం పాకిస్తాన్ సొంత ప్రజలపై శతఘ్నులు, మోర్టార్లతో దాడులు నిర్వహిస్తున్నారు. కుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం బలోచ్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ లక్ష్యంగా ఈ దాడులు కొనసాగిస్తుంది. దాడులలో ప్రాణనష్టం వాటిల్లినట్లుగా తెలుస్తుంది. నాలుగు రోజులుగా డ్రోన్ల దాడులతో సాగుతున్న పాక్ సైన్యం ఆపరేషన్‌తో ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. వారికి ఆహారం, ఇంధనం కొరత ఏర్పడిందని సమాచారం. వరుస బాంబు దాడులతో పంట పొలాలన్నీ ధ్వంసమయ్యాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని మీడియా వర్గాల కథనం.