Pigeons | నగరాలు, పట్టణాల్లో చెట్లు కనిపించకుండా పోతున్నాయి. దీంతో పక్షులకు ఆవాసాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలో పక్షులు తమ ఆవాసాలను హైరైజ్ బిల్డింగ్‌లకు మార్చుకున్నాయి. పెద్ద పెద్ద భవంతుల బాల్కనీల్లో పక్షులు సేద తీరుతూ జీవనం కొనసాగిస్తున్నాయి. మరి ముఖ్యంగా పావురాలు.. ఆయా అంతస్తుల్లోని బాల్కనీల్లోకి చేరి.. ఇబ్బందికర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంటాయి. మరి ఈ పావురాలను ఇంటి బాల్కనీ నుంచి తరిమేయాలంటే ఈ చిన్న ట్రిక్కు పాటిస్తే సరిపోతుంది.
ఓ వ్యక్తి హైరైజ్ భవనంలో నివపిస్తున్నాడు. అయితే ఆ అంతస్తుల్లో పావురాలు వచ్చి వాలుతున్నాయి. వాటిని తరిమేసినా కూడా ఎండలకు మళ్లీ వచ్చి వాలుతున్నాయి. బాల్కనీకి నెట్ లేదా ఇనుప గ్రిల్ ఏర్పాటు చేసినా కూడా భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. మరేం చేయాలి. తక్కువ ఖర్చులో పావురాలను బాల్కనీ నుంచి తరిమేయడం ఎలా..? అనే విషయాన్ని చెప్పాడు.
బాల్కనీ గ్రిల్‌కు అల్యూమినియం ఫాయిల్‌ను వేలాడదీయాలని సూచించాడు. అక్కడక్కడ ఇలా అల్యూమినియం ఫాయిల్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఆ దరిదాపుల్లోకి కూడా పావురాలు రావని తెలిపాడు. ఎందుకంటే ఆ ఫాయిల్ సూర్యరశ్మిని పావురాల కళ్ళలోకి పరావర్తనం చెందించి, ఆ ప్రదేశాన్ని అవి కూర్చోవడానికి అసౌకర్యంగా మారుస్తుందని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల తమ బాల్కనీలోకి ఒక్క పావురం కూడా రావడం లేదన్నాడు. అదే వేరే బాల్కనీల్లో అలా చేయకపోవడం వల్ల అక్కడ వాలుతున్నాయని వీడియో చూపించాడు.
ఒక వేళ బాల్కనీకి నెట్ ఏర్పాటు చేస్తే భారీగా ఖర్చు అవుతుంది. రూ. 1400 నుంచి రూ. 1500 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ ఖర్చు భరించలేని వారు కూడా ఉంటారు. కాబట్టి తక్కువ ధరకే లభించే అల్యూమినియం ఫాయిల్‌ను బాల్కనీలో ఏర్పాటు చేస్తే పావురాల బెడద నుంచి తప్పించుకోవచ్చు. మరి మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.. మీకు పావురాల బెడద ఉంటే బాల్కనీలో అల్యూమినియం ఫాయిల్‌ను ఏర్పాటు చేసుకోండి సుమా..!
