తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేరళ మాజీ సీఎం విజయన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో పేదల ఇండ్లను కూల్చేందుకు చేపట్టిన హైడ్రా ప్రాజెక్టును.. నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్పూర్తితో చేపట్టినట్లు సీఎం రేవంత్ పేర్కొనడంపై విజయన్ మండిపడ్డారు. విజయన్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ అంశంపై స్పందించారు. ఆక్రమణలను కూల్చివేతకు చేపట్టిన హైడ్రా ప్రాజెక్టును.. నాజీ నియంత హిట్లర్‌తో పోల్చడాన్ని విజయన్ తప్పుపట్టారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్‌గా ఉన్నట్లు విజయన్ పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను అవమానించినట్లే అవుతుందని తెలిపారు.
ప్రపంచ చరిత్రలోనే కిరాతకమైన నియంతగా పేరును హిట్లర్ స్పూర్తితో హైడ్రాను ఏర్పాటుచేసినట్లు రేవంత్ చెప్పడం సిగ్గుచేటు అని విజయన్ తన ఎఫ్‌బీలో విమర్శించారు. హింస, నిరంకుశత్వానికి కేంద్ర బిందువైన ఓ వ్యవస్థను స్పూర్తిగా తీసుకుని, ప్రజాస్వామ్య దేశానికి చెందిన ఓ ముఖ్యమంత్రి పబ్లిక్‌గా మాట్లాడడం సరికాదన్నారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. ఫాసిజంకు మరో పేరుగా నిలిచిన హిట్లర్‌ను కీర్తిస్తున్న రీతిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడడం ఆందోళనకరమైన అంశమన్నారు. తన బుల్డోజర్ రాజ్‌ను సమర్థించుకునేందుకు హైడ్రా గురించి పబ్లిక్‌గా, గర్వంగా ఫీలవుతున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారంటూ విమర్శించారు.
తెలంగాణ సీఎం రేవంత్‌కు గతంలో సంఘ్ పరివార్‌తో ఉన్న లింకుల ప్రభావం ఆయన హిట్లర్ త్ వ్యాఖ్యల్లో ఉన్నట్లు కనిపిస్తుందని విజయన్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన నోరు జారడమే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత క్యారెక్టర్‌ను ఆయన వ్యాఖ్యలు బయటపెడుతున్నాయని విజయన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించలేదన్న అంశం దీంతో స్పష్టమవుతోందని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తుల పట్ల ప్రజాస్వామ్య ఆలోచన ఉన్న పౌరులు సమీక్షించుకోవాలని విజయన్ కోరారు.
