PM Modi | ప్రధానుల ఎర్రకోట ప్రసంగాల్లో మోదీ కొత్త రికార్డు
దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో భాగంఆ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతకావిష్కరణ అనంతరం తన సుదీర్ఘ ప్రసంగంతో పలు అరుదైన ఘనతలు సాధించారు

సుదీర్ఘ సమయం ప్రసంగించిన ప్రధానిగా మోదీ
విధాత, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో భాగంఆ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతకావిష్కరణ అనంతరం తన సుదీర్ఘ ప్రసంగంతో పలు అరుదైన ఘనతలు సాధించారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను మోదీ ఎగురవేశారు. అనంతరం ఎర్రకోట నుంచి వరుసగా 11వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తద్వారా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. అంతేకాదు సుదీర్ఘ ప్రసంగం చేసి తన రికార్డును తానే అధిగమించారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం మోదీ 98 నిమిషాల పాటు జాతినుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. అంతకు ముందు 2016లో 96 నిమిషాల పాటు మోదీ ప్రసంగించారు. ఇప్పటి వరకూ అదే సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. తాజాగా ఆ రికార్డును మోదీ అధిగమించారు. ఇక మోదీ ప్రసంగాల్లో 2017లో చేసిన ప్రసంగం అతిచిన్నది. ఆ ఏడాది కేవలం 56 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.
మోదీ ప్రసంగాల రికార్డులు
2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి మోదీ జాతీయ జెండాను ఎగురవేశాక ఎర్రకోట నుంచి 65 నిమిషాల పాటు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. 2015లో దాదాపు 86 నిమిషాల పాటు ప్రసంగించారు. 2016లో 96 నిమిషాలు మాట్లాడారు. 2017లో 56 నిమిషాలు ప్రసంగించారు. 2018లో 83 నిమిషాలు, 2019లో 92 నిమిషాలు ప్రసంగించారు. 2020లో మోదీ ప్రసంగం 90 నిమిషాల పాటు కొనసాగింది. 2021లో 88 నిమిషాలు, 2022లో 74 నిమిషాలు, 2023లో 90 నిమిషాల ప్రసంగించారు. మూడోసారి ప్రధాని పదవీ చేపట్టాక 2024లో 98 నిమిషాలపాటూ ప్రసంగించారు.
మోదీ కంటే ముందు..
ప్రధాని మోదీ కంటే ముందు 1947లో జవహర్‌లాల్ నెహ్రూ, 1997లో ఐకే గుజ్రాల్ వరుసగా 72, 71 నిమిషాలు సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ కూడా 1954 , 1966లో వరుసగా 14 నిమిషాల పాటు అతి తక్కువ ప్రసంగాలు చేశారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఎర్రకోట నుంచి స్వల్ప సమయం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేశారు. మన్‌మోహన్ సిం్ 2012లో 32నిమిషాలు, 2013లో 35 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. వాజ్‌పేయి 2002లో 25నిమిషాలు, 2003లో 30 నిమిషాల కంటే తక్కువగా ప్రసంగించారు.