Modi Speaks With Pezeshkian : ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కి ప్రధాని మోదీ ఫోన్

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి శాంతి, భద్రతపై చర్చించారు.

Modi Speaks With Iran President Pezeshkian

విధాత : పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితుల వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా రంజాన్‌, నౌరుజ్‌ (పర్షియన్‌ నూతన సంవత్సరం) శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ.. ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై వారు చర్చించారు.

ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు చేసే, ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ప్రధాని మోదీ ఖండించారు. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగాలని.. నౌకామార్గాలు తెరచి ఉంచడం, వాటిని సురక్షితంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇరాన్‌లోని భారతీయుల రక్షణకు ఆ దేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ అభినందించారు.

ఇవి కూడా చదవండి :

Expiry Date On Eggs : మీకు తెలుసా? కోడిగుడ్డుకూ ఉంది..ఓ ఎక్స్ పైరీ డేట్ !
Pilot Rohith Reddy : పైలట్ రోహిత్ రెడ్డికి మరోషాక్.. మెయినాబాద్ ఫామ్ హౌస్ సీజ్

Latest News