Rave Party | బెంగళూరులో రేవ్‌ పార్టీ గుట్టు రట్టు.. 115 మందికి పరీక్షలు.. ఎవరెవరున్నారు?

దేవిగెరే క్రాస్‌ సమీపంలో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారాన్ని అందుకు పోలీసులు.. బెంగళూరు దక్షిణ జిల్లా ఎస్పీ ఆర్‌ శ్రీనివాస్‌ గౌడ నేతృత్వంలో కగ్గలిపుర పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది తనిఖీలు తెల్లవారుజామున చేపట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారి వయసు 20 ఏళ్లకు అటూఇటూగా ఉంటుందని పోలీసులు చెప్పారు.

  • By: TAAZ |    national |    Published on : Nov 01, 2025 7:41 PM IST
Rave Party | బెంగళూరులో రేవ్‌ పార్టీ గుట్టు రట్టు.. 115 మందికి పరీక్షలు.. ఎవరెవరున్నారు?

Rave Party | ఆధునిక పోకడలు పోతున్న యువత.. పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. రహస్యంగా పార్టీలు ఏర్పాటు చేసుకుని, మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో మునిగిపోతున్నారు. ప్రత్యేకించి నగర ప్రాంతాల యువత దీనికి సులువుగా ఆకర్షితులవుతున్నారు. బర్త్‌డేలనో, లేదా ఇతర పార్టీలనో చెప్పి.. రేవ్‌ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఎంత రహస్యంగా నిర్వహిస్తున్నా.. కొన్ని పార్టీల విషయాలు బయటకు పొక్కి దొరికిపోతున్నారు. కేసులలో చిక్కి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదే తరహాలో బెంగళూరులో శివారు ప్రాంతంలో నిర్వహిస్తున్న రేవ్‌ పార్టీని పోలీసులు శనివారం భగ్నం చేశారు. ఈ సమయంలో 115 మందికిపైగా అక్కడ ఉన్నారని అధికారులు తెలిపారు. వారందరికీ మాదక ద్రవ్యాలు తీసుకున్నారా? అనేది నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

దేవిగెరే క్రాస్‌ సమీపంలో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారాన్ని అందుకు పోలీసులు.. బెంగళూరు దక్షిణ జిల్లా ఎస్పీ ఆర్‌ శ్రీనివాస్‌ గౌడ నేతృత్వంలో కగ్గలిపుర పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది తనిఖీలు తెల్లవారుజామున చేపట్టారు. ఈ పార్టీలో పాల్గొన్న వారి వయసు 20 ఏళ్లకు అటూఇటూగా ఉంటుందని పోలీసులు చెప్పారు.

ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ఈ పార్టీని నిర్వహించారని, పార్టీలో గంజాయి తాగి ఉంటారని అనుమానిస్తున్నామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసి, ప్రశ్నిస్తున్నామని ఎస్పీ శ్రీనివాస గౌడ చెప్పారు. ‘పార్టీ జరిగిన ప్రాంతం ఒక హోం స్టే. అందులో పార్టీలు నిర్వహించేందుకు అనుమతి లేదు. దర్యాప్తు అధికారులు అక్కడ కొన్నింటిని రికవరీ చేసి, విశ్లేషిస్తున్నారు. ఆర్గనైజర్లను, ప్రాపర్టీ యజమానులను ప్రశ్నిస్తున్నాం’ అని ఎస్పీ తెలిపారు.

Read Also |Karthika Masam | ఈ నెల మొత్తం పండుగలే.. ముఖ్యమైన రోజులు ఇవే!
Aadhaar Update | నేటి నుండి ఆధార్​ అప్​డేట్​లో సంచలన మార్పులు : మీకు తెలుసా?
HYDRAA | మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
Ilambarthi IAS | ఇలంబర్తి మళ్లీ బదిలీ!.. సీఎస్ కు అదనపు బాధ్యతలు