రాజ్యసభలో 113 కు పెరిగిన బీజేపీ సంఖ్యా బలం

బీజేపీలో అధికారికంగా పూర్తయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏడుగురు రాజ్యసభ ఎంపీల విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల విలీనంతో రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్యా బలం 113కు పెరిగింది.

న్యూఢిల్లీ : బీజేపీలో అధికారికంగా పూర్తయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏడుగురు రాజ్యసభ ఎంపీల విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ సభ్యులలో రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్,హర్బజన్ సహా తాజాగా ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో ఆప్ పార్టీ రాజ్యసభ పక్షం ఆ పార్టీలో విలీనమైంది. ఆమ్ ఆద్మీ విలీనం తర్వాతా రాజ్యసభ చైర్మన్  సీపీ రాధాకృష్ణన్‌ ఎగువ సభలోని పార్టీల బలాబలాలను ప్రకటించారు.  ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల విలీనంతో రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్యా బలం 113కు పెరిగింది. సాధారణ మెజారిటీకి కేవలం 10 సీట్ల దూరంలో ఉంది.

అయితే ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245స్థానాలు ఉండగా. ఎన్డీఏ మొత్తం బలం 128కు చేరింది. ఇది మెజారిటీ మార్కు 122 ను అధిగమించడం విశేషం.రాజ్యసభలో ఎన్డీఏ మిత్రపక్షాలు, నామినేటెడ్ సభ్యులు, స్వతంత్రులతో కలిసి ఈ కూటమి ఇప్పటికే 141 మంది సభ్యుల బలం ఉంది. మూడింట రెండు వంతుల మెజారిటీకి కేవలం 14 సీట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఎన్డీఏకు ఉన్న బలం ఇతర పార్టీల మద్దతు లేకుండా సాధారణ చట్టాలను ఆమోదించడానికి వీలు కల్పిస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్ ప్రమాణస్వీకారం
Anushka Sharma | సింపుల్ లుక్‌లోనే లగ్జరీ టచ్.. ఐపీఎల్ స్టేడియంలో అనుష్క శర్మ ఫ్యాషన్ హైలైట్,వాచ్ ధ‌ర తెలుసుకొని నోరెళ్ళ‌పెట్టిన నెటిజ‌న్స్

Latest News