Road accident | అదుపుతప్పి గోతిలోపడ్డ ఆర్టీసీ బస్సు.. నలుగురు దుర్మరణం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

Road accident | వేగం నలుగురి నిండు ప్రాణాలు తీసింది. ఆర్టీసీ డ్రైవర్‌ బస్సును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన గోతిలో పడింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలోని జుబ్బల్‌ ఏరియాలో ఇవాళ (శుక్రవారం) ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Road accident | అదుపుతప్పి గోతిలోపడ్డ ఆర్టీసీ బస్సు.. నలుగురు దుర్మరణం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

Road accident : వేగం నలుగురి నిండు ప్రాణాలు తీసింది. ఆర్టీసీ డ్రైవర్‌ బస్సును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన గోతిలో పడింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలోని జుబ్బల్‌ ఏరియాలో ఇవాళ (శుక్రవారం) ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

‘హిమాచల్‌ప్రదేశ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ (HRTC)’ కు చెందిన బస్సు జుబ్బల్‌లోని గిల్తాడి రోడ్డుపై ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మరణించిన నలుగురిలో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టానికి పంపారు.

ఆర్టీసీ బస్సు జుబ్బల్‌ మీదుగా వెళ్తుండగా గిల్తాడి రోడ్డుపై ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 9 మంది ప్రయాణికులు, డ్రైవర్‌, కండక్టర్‌ మొత్తం 11 మంది ఉన్నారని చెప్పారు. డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మిగతా ఏడుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.