ప్రధాని నరేంద్ర మోదీ సంపాదించుకున్న విశ్వగురువు క్రేజ్, అత్యంత ప్రజాదరణ నేతగా వచ్చిన గుర్తింపు వెనుక దాగిన ప్రచార ఆర్భాటానికి ఏకంగా రూ.2,586కోట్ల ప్రజాధనం ఖర్చయిపోయిందన్న సంగతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆర్టీఐ లెక్కల ప్రకారం గత ఐదున్నరేళ్లలో ప్రధాని మోదీ పీఆర్(ప్రచార, పౌరసంబంధాలు) కోసం కేంద్రం పెట్టిన ఖర్చు అక్షరాల రూ. 2,586కోట్లు అని బహిర్గతమవ్వడం హాట్ టాపిక్ గా నిలిచింది. టీఏంసీ ఎంపీ సాకేత్ గోఖలే చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఇచ్చిన సమాధానంలో ప్రధాని మోదీ ప్రచార ఖర్చు లెక్కలు వెల్లడయ్యాయి. 2021 నుంచి 2026 ఇప్పటివరకు టీవీ, రేడియో ప్రకటనలకు రూ.936 కోట్లు, ప్రింట్ మీడియాకు రూ. 796 కోట్లు, డిజిటల్ అండ్ సోషల్ మీడియాకు రూ.270 కోట్లు, హోర్డింగ్ లకు రూ.584 కోట్లు ఖర్చు చేసినట్లుగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ పేర్కొంది.
అయితే ఈ డబ్బంతా ఒకే ఏజెన్సీకి వెళ్లిందని, ఆ ఏజెన్సీ వివరాలు అడిగితే కమర్షియల్ కాన్ఫిడెన్స్ పేరిట సీబీసీ ఆ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిందని ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపించడం మరింత సంచలనంగా మారింది. ప్రధాని కార్యక్రమాల ప్రచార ఖర్చుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఇచ్చిన వివరాలు పూర్తి స్థాయిలో లేవని..వాస్తవంగా రూ.2586కోట్ల ఖర్చు కంటే.. ఇంకా చాలా ఎక్కువ నిధులే ఖర్చు చేసి ఉండవచ్చని ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపిస్తుండటం ఆసక్తికర చర్చకు దారితీసింది.
నిజానికి దేశ, విదేశీ పర్యటనలలో ప్రధాని మోదీ పీఆర్ టీమ్ చేసే హడావుడి చూసిన వారికి ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపణల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదంటున్నారు కొందరు నెటిజన్లు.
ఆర్టీఐ లెక్కల ప్రకారం గత ఐదున్నరేళ్లలో ప్రధాని మోదీ పీఆర్ కోసం కేంద్రం పెట్టిన ఖర్చు అక్షరాల రూ. 25,86,00,00,000. టీఏంసీ ఎంపీ సాకేత్ గోఖలే చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు బదులిచ్చిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్. 2021 నుంచి 2026 ఇప్పటివరకు టీవీ, రేడియో ప్రకటనలకు రూ.936 కోట్లు,… pic.twitter.com/EsfKj6LM16
— Tharun Reddy (@Tarunkethireddy) June 19, 2026
