17న తెరచుకోనున్న శబరిమల ఆలయ ద్వారాలు..! రెండు నెలల పాటు మహా దర్శనాలు..!
శబరిగిరీషుడు అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయ ద్వారాలు ఈ నెల 17న తెరచుకోనున్నాయి. వార్షిక మండలం-మకరవిళిక్కు పండుగ ప్రారంభం కానుండడంతో ద్వారాలు తెరువనున్నారు.
శబరిగిరీషుడు అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయ ద్వారాలు ఈ నెల 17న తెరచుకోనున్నాయి. వార్షిక మండలం-మకరవిళిక్కు పండుగ ప్రారంభం కానుండడంతో ద్వారాలు తెరువనున్నారు. పతనంతిట్ట జిల్లాలోని దట్టమైన అడవులు, నదులు, ప్రకృతి దృశ్యాల మధ్య అయ్యప్పస్వామి ఆలయం స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మారుమోగనున్నది.
నవంబర్ 17 నుంచి మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభం కానుండగా.. రెండు నెలలపాటు అయ్యప్పస్వామి వారి మహాదర్శనాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కేరళ దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అనేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సురక్షితంగా, సాఫీగా యాత్రను జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మకరవిళిక్కు పండుగ సందర్భంగా సీఎం పినరయి విజయన్‌తో సహా ఆరు ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయని తెలిపారు. ఆలయం వద్ద భారీగా రద్ది ఉంటుందని, ఈ మేరకు డైనమిక్ క్యూ కంట్రోల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. నిలాక్కళ్, పంబా, సన్నిధానం ప్రాంతాల్లో వీడియో స్క్రీన్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. పంబా-సన్నిధానం మార్గంలో 15 చోట్ల ఎమర్జెన్సీ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram