Ahmedabad Plane Crash | ఆ యువ‌తి క‌ల‌లు బుగ్గిపాలు.. ఆమె బంగారు భ‌విష్య‌త్ స‌జీవ‌ద‌హ‌నం

Ahmedabad Plane Crash | ఆమె క‌ల( Dream ) క‌ల‌గానే మిగిలిపోయింది.. ఆ క‌ల‌ల‌న్నీ బుగ్గిపాల‌య్యాయి. లండ‌న్‌( London )లో ఉన్న‌త విద్య చ‌దివి.. గొప్ప‌గా ఎద‌గాల‌నుకున్న ఆమె బంగారు భ‌విష్య‌త్ స‌జీవ‌ద‌హ‌న‌మైంది. అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం(Ahmedabad Plane Crash )లో స‌జీవ‌ద‌హ‌న‌మైన ఓ యువ‌తి క‌థ ఇదీ..

Ahmedabad Plane Crash | ఆ యువ‌తి క‌ల‌లు బుగ్గిపాలు.. ఆమె బంగారు భ‌విష్య‌త్ స‌జీవ‌ద‌హ‌నం

Ahmedabad Plane Crash | అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం( Ahmedabad Plane Crash ).. ఎన్నో కుటుంబాల‌కు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బ‌తుకుదెరువు కోసం కొంద‌రు.. ఉన్న‌త చ‌దువుల కోసం మ‌రికొంద‌రు.. ప‌ర్యాట‌కం కోసం ఇంకొంద‌రు.. అలా లండ‌న్( London ) వెళ్తున్న వారిని ఎయిరిండియా( Air India ) విమానం బ‌లి తీసుకుంది. అహ్మ‌దాబాద్ ఎయిర్‌పోర్టు( Ahmedabad Airport )  నుంచి లండ‌న్‌కు టేకాఫ్ అయిన కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే ఎయిరిండియా విమానం కుప్ప‌కూలిపోవ‌డంతో 241 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు.

ఈ స‌జీవ‌ద‌హన‌మైన వారిలో ఉన్న‌త చ‌దువుల కోసం లండ‌న్ వెళ్తున్న ఓ యువ‌తి కూడా ఉంది. రాజ‌స్థాన్‌( Rajasthan )లోని ఉద‌య్‌పూర్‌( Uadipur )కు చెందిన పాయ‌ల్ ఖాతిక్( Payal Khatik ).. లండ‌న్‌లో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించాల‌నుకుంది. ఈ క్ర‌మంలో ఆమె నిన్న లండ‌న్‌కు ఎయిరిండియా ఫ్లైట్‌లో బ‌య‌ల్దేరింది. కానీ ఆమె క‌ల క‌ల‌గానే మిగిలిపోయింది. ఆమె బంగారు భ‌విష్య‌త్ బుగ్గిపాలు అయింది.

పాయ‌ల్ ఖాతిక్ చిన్న‌ప్ప‌ట్నుంచి చ‌దువుల్లో గొప్పగా రాణిస్తుంద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. స్కూల్ టాప‌ర్‌గా కూడా నిలిచింద‌ని గుర్తు చేశారు. ఆమె త‌న భ‌విష్య‌త్ గురించి ఎన్నో క‌ల‌లు క‌నేద‌ని, దేశానికి కీర్తి తీసుకురావాల‌ని క‌ల‌లు క‌న్న‌ట్లు బంధువులు తెలిపారు. కానీ ఇలా విమాన ప్ర‌మాదంలో స‌జీవ‌ద‌హ‌నం అవుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేద‌ని త‌ల్లిదండ్రులు, బంధువులు బోరున విల‌పించారు. ఖాతిక్ త‌ల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా గుజ‌రాత్‌లోని హిమ్మ‌త్‌న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నారు.