NEET-UG Exam | నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ కేసు.. విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు..!
NEET-UG Exam | నీట్ యూజీ పరీక్షల (NEET-UG Exam) పేపర్ లీక్ కేసులో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో తన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరగలేదని, పరీక్షను రద్దుచేయాల్సిన అవసరం లేదని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం ఇవాళ విచారించింది.

NEET-UG Exam : నీట్ యూజీ పరీక్షల (NEET-UG Exam) పేపర్ లీక్ కేసులో విచారణ వాయిదా పడింది. ఈ కేసులో తన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. నీట్ పరీక్షలో పేపర్ లీక్ జరగలేదని, పరీక్షను రద్దుచేయాల్సిన అవసరం లేదని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం, సీబీఐ, ఎన్టీఏ తరఫు వాదనలను సుప్రీంకోర్టు విన్నది.
అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ తన నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు అందించింది. ప్రశ్నాపత్రం లీకేజీ విస్తృత స్థాయిలో జరగలేదని తన నివేదికలో సీబీఐ పేర్కొంది. ఈ కేసులో అన్ని వైపు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. జూలై 18న తదుపరి విచారణ పూర్తి చేసి, అదేరోజు ఆదేశాలు ఇస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.
నీట్ యూజీ పరీక్షలో ఎలాంటి సామూహిక మాల్‌ప్రాక్టీస్ జరగలేదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు అఫిడవిట్ సమర్పించింది. వచ్చే వారం నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ కూడా ప్రారంభిస్తామని కోర్టుకు తెలిపింది. మే 4న టెలిగ్రామ్‌లో లీక్ అయినట్టుగా చూపిస్తున్న నీట్ యూజీ పరీక్ష పేపర్ ఫేక్ అని పేర్కొంటూ ఎన్టీఏ అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షపై దుష్ప్రచారం కోసం టైమ్‌స్టాంప్ మార్చబడిందని పిటిషన్‌లో తెలిపింది.