Huzurabad: 10th పేపర్ లీక్.. ముందు ఈటల రాజేందర్‌ను అరెస్టు చేయాలి: పాడి కౌశిక్ రెడ్డి
పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బిజెపి పార్టీ మీడియాతో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి విధాత బ్యూరో, కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన కుట్రలో భాగంగానే పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన హుజురాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. వీరిద్దరూ కలిసి పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ప్రశ్న పత్రాల […]

- పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బిజెపి పార్టీ
- మీడియాతో ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి
విధాత బ్యూరో, కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన కుట్రలో భాగంగానే పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన హుజురాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
వీరిద్దరూ కలిసి పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.
ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో మొదట అరెస్టు చేయాల్సింది మాజీ మంత్రి ఈటల రాజేందర్ నే అని అన్నారు. తమ రాజకీయాల స్వలాభం కోసం పేద విద్యార్థుల జీవితాల్లో చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
మహేష్ అనే వ్యక్తి గతంలో ఈటల పోలింగ్ బూత్ ఏజెంట్ గా పని చేసింది వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ PAగా పని చేస్తున్న వ్యక్తికి పేపర్ లీక్ అయిందని ఎలా తెలుస్తుందన్నారు. పేపర్ లీక్ వ్యవహారంతో బిజెపి నేతలకు సంబంధం లేకుంటే వాట్సప్ గ్రూపులలో చాటింగ్ ఎలా చేశారని ప్రశ్నించారు.
తన రాజకీయాల కోసం ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడో.. పేద విద్యార్థులను అలాగే మోసగించాడన్నారు. వీరి ఆ సత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. ప్రశ్నా పత్రాల లీకేజ్ లాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.