తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకే అధినేత విజయ్ ని ఆహ్వానించే విషయమై తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని ముందుగా నిరూపించుకుంటేనే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని మళ్లీ పీటముడి వేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలంటూ విజయ్ గవర్నర్ ను రెండోసారి కలిసి తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీల సంఖ్యాబలం లెక్కలను వివరించారు.
అయితే 234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 118. టీవీకే (107 సీట్లు), కాంగ్రెస్ (5) = 112 సీట్ల మెజార్టీ లేఖలను మాత్రమే గవర్నర్ కు విజయ్ అందించారు. బల పరీక్షలో నెగ్గడానికి టీవీకేకు కనీసం మరో 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం)లలో కలిపి 6 మంది ఉన్నారు. వారు మౌఖికంగా మద్దతు తెలిపినప్పటికి.. ఇంకా లిఖితపూర్వకంగా తెలియజేయలేదు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యమవుతోంది. ప్రమాణ స్వీకారానికి ముందు స్థిరమైన మెజారిటీ ఉండాలని గవర్నర్ పట్టుబడుతున్నారు. అయితే విజయ్ మాత్రం ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తే..అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటానంటూ చెప్పినట్లుగా సమాచారం. ఈ విషయమై గవర్నర్ స్పందిస్తూ…తాను మరెవరిని ప్రభుత్వ ఏర్పాటు విషయమై ఆహ్వాచించబోనని, ముందుగా అతిపెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకే అవకాశం ఇస్తానని..లిఖిత పూర్వక మద్దతుకు మరింత సమయం ఇస్తానని భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
లోక్ భవన్ వివరణ
కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయమై గవర్నర్ తో విజయ్ భేటీ అయ్యారని, మెజార్టీ సంఖ్యాబలంతో కూడిన వివరాలను ఆయన ఇవ్వలేకపోయారని వెల్లడించింది. 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలంతో మళ్లీ రావాలని గవర్నర్ సూచించినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి :
సాధారణ ట్రాఫిక్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్
రేవంత్ రెడ్డి పాలన ఢిల్లీకి నజరానా.. రైతులకేమో జరిమానా: హరీశ్ రావు
