Minor Boy Collapsed While Exercising | మైనర్ బాలుడిని బలిగొన్న గుండెపోటు

గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. రామనాథపురం జిల్లా ఏర్వాడికి చెందిన మహ్మద్‌ ఫాహిం (17) అనే మైనర్ బాలుడు వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు.

Minor Boy Collapsed While Exercising | మైనర్ బాలుడిని బలిగొన్న గుండెపోటు

విధాత : ఇటీవల గుండెపోటు మరణాలు వయసుతో నిమిత్తం లేకుండా సాగుతూ అందరిని కలవరానికి గురి చేస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్దుల వరకు నిత్యం గుండెపోటు మరణాలు కబళిస్తున్న తీరుతో ఎవరి ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. తాజాగాఓ మైనర్ బాలుడు వ్యాయామం చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన అందరిని కలిచివేసింది.

రామనాథపురం జిల్లా ఏర్వాడికి చెందిన మహ్మద్‌ ఫాహిం(17) స్థానిక పాఠశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ప్రతిరోజు పాఠశాల ముగిసిన వెంటనే దర్గా( ప్రాంగణంలో వ్యాయామం చేస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం వ్యాయామం చేస్తుండగా స్పృహతప్పి పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతన్ని వెంటనే అంబులెన్స్‌లో కీలక్కరై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.