TVK Chief Vijay : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నాకు, స్టాలిన్ కు మాత్రమే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ తనకు, స్టాలిన్‌కే పరిమితమని టీవీకే చీఫ్ విజయ్ వ్యాఖ్యలు. డీఎంకే ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

TVK Chief Vijay

విధాత : తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ విజయ్ కు, స్టాలిన్ కు మాత్రమేనని, డీఎంకే కూటమిని ఓడించి టీవీకే అధికారంలోకి వస్తుందని టీవీకే చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెల్లూరు సభలో విజయ్ మాట్లాడారు. తమిళనాడు అంటే విజయ్, విజయ్ అంటే తమిళనాడు అని, సిద్ధాంతపరంగా బీజేపీ తనకు శత్రువు అయితే, ప్రధాన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే అని స్పష్టం చేశారు. సీఎం స్టాలిన్‌ది సూపర్‌స్టార్ పాలనకాదు అని, స్టాండప్ కమెడియన్ పాలన అని విజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతం జరగబోతోందని అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్యే పోటీ అని విజయ్‌ అన్నారు. రాష్ట్రంలో అవినీతి, నేరాలను అరికట్టడంలో స్టాలిన్‌ ప్రభుత్వం విఫలమయ్యిందని విజయ్‌ ఆరోపించారు.

త్వరలో జరగనున్నవి ఎన్నికలు కాదని తమిళనాడు ప్రజలకు, అవినీతి ప్రభుత్వానికి మధ్య యుద్ధమని అన్నారు. ఈ యుద్ధంలో ప్రజలే విజయం సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనను ఎలాగైనా ఓడించాలనే ఆలోచనతో స్టాలిన్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో స్టాలిన్‌ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుందని ఆరోపించారు. పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం ఆ పార్టీ నేతలకు అలవాటేనని దుయ్యబట్టారు.

ప్రభుత్వాల అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తూ.. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే అందరూ తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విజయ్‌ ఆరోపించారు. తమ పార్టీ నిర్వహించే బహిరంగ సభలకు కూడా డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదన్నారు. అందువల్లే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను కలవలేకపోతున్నానని వెల్లడించారు. టీవీకే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

Gold, Silver Price Today : పెరిగిన బంగారం, వెండి ధరలు !
Army Dog Tyson | మొదటి బుల్లెట్​ తనకే.. అయినా మోస్ట్​వాంటెడ్​ను పట్టించేంతవరకు తగ్గలేదు : శునక ‘సైనికుడు’ టైసన్ వీరగాథ

Latest News