Gold, Silver Price Today : పెరిగిన బంగారం, వెండి ధరలు !

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గ్లోబల్ కొనుగోళ్లు, దిగుమతుల ప్రభావమే ప్రధాన కారణమని నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ పేర్కొన్నారు.

Reported by: Tejaswini Nanna | వాణిజ్యం | Feb 23, 2026, 4:14 pm IST
Read Time: 4 mins
Gold, Silver Price Today : పెరిగిన బంగారం, వెండి ధరలు !

విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు మరోసారి పైపైకి వెళ్లాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,070 పెరిగి రూ. 1,61,350కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,900పెరిగి రూ.147,900కు పెరిగింది. కిలో వెండి ధర రూ. 10,000పెరిగి మరోసారి రూ. 3,00,000 లక్షల మార్కును తాకింది. అంతర్జాతీయంగా ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక విధానాలు, అధ్యక్షుడు ట్రంప్ సుంకాల నిర్ణయాలు బంగారం ధరలను తీవ్ర హెచ్చుతగ్గులకు గురి చేస్తున్నాయి.

అందుకే బంగారం ధరలు పెరిగాయి.: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

బంగారం, వెండి ధరల హెచ్చు తగ్గులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశీయ మార్కెట్లో వినియోగంలో ఉన్న బంగారం దాదాపు మొత్తం దిగుమతుల ద్వారానే వస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టడంతోనే బంగారం ధరకు రెక్కలు వచ్చాయని…అందుకే అంతర్జాతీయ మార్కెట్లలో జరిగే మార్పులు భారత బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని ఆమె చెప్పారు. బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవన్నారు. ఈ పరిణామాలను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు గమనిస్తోందని చెప్పారు. ఇండో-యూఎస్ వాణిజ్య ఒప్పందం లేదా అమెరికా టారిఫ్ నిర్ణయాల ప్రభావంపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటుగా ఉంటుందని కూడా ఆమె స్పష్టం చేశారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు బంగారం, వెండిని భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటుండటమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలిపారు. ఇది కేవలం భారత మార్కెట్‌కు మాత్రమే సంబంధించిన విషయం కాదని, గ్లోబల్ ట్రెండ్‌గా మారిందని అన్నారు.

ఇవి కూడా చదవండి :

Engineering Student | స్నేహితుడికి సాయం చేసి.. సైబ‌ర్ ఉచ్చులో చిక్కుకున్న విద్యార్థి
Peacock Tail Fish : సముద్రంలోని ద్వారకలో నెమలి పింఛంతో చేపలు.. వైరల్ వీడియో