TVK Chief Vijay : తొక్కిసలాట ఘటన కేసుతో రాజకీయ వేధింపులు
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మృతి, 11 పరిస్థితి విషమం టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజకీయ వేధింపులను ఆగ్రహంగా ఖండించారు.

విధాత: కరూర్ తొక్కిసలాట ఘటన కేసును అడ్డం పెట్టుకుని మా పార్టీపై రాజకీయ అణిచివేత చర్యలు..వేధింపులకు అధికార డీఎంకే ప్రభుత్వం దిగుతుందని సినీ నటుడు..టీవీకే అధ్యక్షుడు విజయ్ ఆరోపించారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో 41మంది మృతి చెందిన కేసులో తమిళనాడు పోలీసులు టీవీకే జిల్లా అధ్యక్షుడు మది అలగన్‌ను సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. టీవీకే నేతల అరెస్టుపై స్పందించిన విజయ్ నా కార్యకర్తల జోలికి వెళ్లొద్దు.. సీఎం స్టాలిన్ సర్.. మీరు నాపై కక్ష తీర్చుకోవాలంటే..నన్ను ఏదైనా చేయండి. నేను ఇంట్లో కానీ, ఆఫీస్‌లో కానీ ఉంటాను. నా ప్రజల జోలికి వెళ్లకండి. నేనేం తప్పు చేయలేదు. నా రాజకీయ జీవితం మరింత ఉత్సాహంతో కొనసాగుతుంది’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ తప్పు చేయని మా నేతలపైన, స్నేహితులు, సోషల్ మీడియా వినియోగదారుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు’’ అని తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. నా కార్యకర్తలు జోలికి వెళ్లొద్దు నాతోనే ఫైట్ చేయండి అంటూ విజయ్ స్పష్టం చేశారు. నన్ను టార్గెట్ చేయండి.. నా ప్రజలను కాదు అని వ్యాఖ్యానించారు. నేను భద్రతకే ప్రాధాన్యత ఇస్తానన్నారు.
నేను మనిషినే అని..ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందనే నేను అక్కడ పర్యటించలేదు. త్వరలోనే వారిని కలుస్తా. నేను ఏ తప్పు చేయలేదు అని..ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది అన్నారు. నా గుండె ముక్కలు అయ్యిందని.. మాటలు రావట్లేదు అని.. త్వరలో బాధితులను కలుస్తానని తెలిపారు. అంతకుముందు మేం ఐదు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాం. కానీ ఒక్క కరూర్‌లోనే ఎందుకు ఇలా జరిగింది. ప్రజలకు నిజం తెలుసు. వారంతా చూస్తున్నారు. నిజం త్వరలోనే బయటపడుతుందని.. నేను తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటానన్నారు. విజయ్ ఇప్పటికే టీవీకే తరఫున బాధితులకు రూ.20లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2లక్షలు సహాయాన్ని అందించారు.
కరూర్ ఘటనపై ఎన్డీఏ ఎంపీల బృందం పరిశీలన
తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని హేమా మాలిని నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీల బృందం పరిశీలించింది. బాధిత కుటుంబాలతో మాట్లాడిన ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకుంది. స్టార్ హీరో ప్రచార సభకు ఇరుకైన ప్రాంతాన్ని ఎంపిక చేయడాన్ని ఎంపీల బృందం తప్పుబట్టింది. ఈ తొక్కిసలాటకు ‘బాధ్యులెవరు?’ అనేదే ప్రశ్న అని ఎంపీల బృందం సారధి హేమమాలిని పేర్కొంది. బాధితులు ఇంకా కోలుకోలేని..వారికి మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. ఇరుకైన వేదిక, కరెంటు కట్ చేయడం వంటివి అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇవి అసాధారణంగా కనిపిస్తున్నాయని హేమా మాలిని అభిప్రాయపడ్డారు. మరో ఎంపీ అనురాగ్ ఠాకుర్ మాట్లాడుతూ.. విజయ్ ప్రచార సభకు ఏర్పాట్లు చేయడంలో తమిళనాడు పోలీసులు నిర్లక్ష్యంగా వహించినట్లు కనిపిస్తోందన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే 41మంది చనిపోగా..మరో 11మంది పరిస్థితి విషమంగా ఉంది.