H-1B Visa| హెచ్ 1 బీ వీసా ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చిన అమెరికా

హెచ్ 1 బీ వీసాలపై గందరగోళ వాతావరణం నెలకొన్నందున వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టత ఇచ్చారు. హెచ్ 1 బీ వీసా ఫీజు లక్ష డాలర్లు వన్ టైమ్ ఫీజు మాత్రమే... ఇది ప్రతి ఏటా చెల్లించాల్సిన అవసరం లేదని ఆమె ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ వీసా కలిగి ఇతర దేశాల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. వీరు అమెరికాకు తిరిగి రావాలంటే ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టత ఇచ్చారు.

H-1B Visa| హెచ్ 1 బీ వీసా ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చిన అమెరికా

H-1B Visa| హెచ్ 1 బీ వీసాల(H-1B Visa) విషయంలో అమెరికా(USA) మరోసారి స్పష్టత ఇచ్చింది. హెచ్ 1 బీ వీసా ఫీజు ను లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) తీసుకున్న నిర్ణయంతో టెక్ కంపెనీలతో పాటు టెక్కీలు ఆందోళన చెందుతున్నారు. హెచ్ 1 బీ వీసాలు కలిగి ఇతర దేశాల్లో ఉన్నవారిని 24 గంటల్లోపుగా అమెరికా రావాలని ఆయా సంస్థలు కోరాయి. హెచ్ 1 బీ వీసాలపై గందరగోళ వాతావరణం నెలకొన్నందున వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టత ఇచ్చారు. హెచ్ 1 బీ వీసా ఫీజు లక్ష డాలర్లు వన్ టైమ్ ఫీజు మాత్రమే… ఇది ప్రతి ఏటా చెల్లించాల్సిన అవసరం లేదని ఆమె ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ వీసా కలిగి ఇతర దేశాల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. వీరు అమెరికాకు తిరిగి రావాలంటే ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టత ఇచ్చారు. హెచ్ 1 బీ వీసాల ఫీజు లక్ష డాలర్లను కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారి నుంచి మాత్రమే వసూలు చేయనున్నట్టు తెలిపారు. అంతేకాదు హెచ్ 1 బీ వీసా రెన్యూవల్ కు కూడా ఇది వర్తించదని వివరించారు.

హెచ్ 1 బీ వీసా సమస్యలపై అమెరికాలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ

హెచ్ 1 బీ వీసా సమస్యలపై అమెరికాలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది భారత ఎంబసీ. ఈ విషయమై ఏమైనా సమస్యలుంటే ఈ కాల్ సెంటర్లకు ఫోన్ చేసి తమ సందేహలను నివృత్తి చేసుకోవాలని భారత ఎంబసీ సూచించింది. అమెరికా కాల్ సెంటర్ +1 -202-550-9931, న్యూయార్క్ కాల్ సెంటర్ +1 917-815-7066 ఏర్పాటు చేశారు. హెచ్ 1 బీ వీసాల ఫీజు పెంపు ప్రభావం భారతీయ టెక్ కంపెనీలతో పాటు ఇండియా నుంచి వెళ్లి అమెరికలో ఉద్యోగం చేయాలనకునే వారి ఆశలపై నీళ్లు చల్లింది. ట్రంప్ నిర్ణయాన్ని అమెరికాలో నిపుణులు తప్పుబడుతున్నారు.