Waqf (Amendment) Act, 2025 | వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హిందూ సంస్థ న్యాయపోరాటం!
గంగా జమున తెహజీబ్‌కు నిదర్శనంగా నిలుస్తున్నది కేరళలోని హిందూ సంస్థ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ నారాయణ మానవ ధామం సుప్రీంకోర్టులో ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేసింది.

Waqf (Amendment) Act, 2025 | కొత్త వక్ఫ్ చట్టం తమ అస్థిత్వాన్ని దెబ్బ తీస్తుందని ముస్లిం ధార్మిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. మీకు మేం అండగా ఉంటామంటూ ఒక హిందూ సంస్థ ముందుకు వచ్చింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని (Waqf (Amendment) Act, 2025 ) వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టం భారతదేశంలో ముస్లింల మనుగడకు ముప్పు కలిగిస్తుందని కేరళకు చెందిన శ్రీ నారాయణ మానవ ధర్మం ట్రస్ట్ తన ఇంటర్వెన్షన్ పిటిషన్‌లో వాదించింది.
వ్యక్తుల, సమాజాల శ్రేయస్సు పరస్పర ఆధారితం
అందరు వ్యక్తుల, సమాజాల శ్రేయస్సు పరస్పర ఆధారితమన్న శ్రీ నారాయణ గురు బోధనలను ట్రస్ట్ తన పిటిషన్‌లో ప్రస్తావిస్తూ.. భారతదేశంలోని ముస్లిం సమాజంపై, మనదేశంలో సామాజిక న్యాయంపై పెను వినాశకరమైన ప్రభావాన్ని తాము మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఊరుకోలేమని పేర్కొన్నది. ఇది అభ్యంతరకరమైన చట్టమని వాదించింది.
వక్ప్‌నే రద్దు చేసే చట్టం ఇది..
వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్‌ఖ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తున్నది. అయితే.. ఇప్పటికే చాలా పిటిషన్లు దాఖలైనందున కొత్తగా పిటిషన్లను దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. కావాలనుకుంటే ఇప్పటికే దాఖలైన పిటిషనర్ల వాదనల్లో జోడించడానికి ఇంటర్వెన్షన్ పిటిషన్స్ వేయవచ్చని తెలిపింది. ఈ మేరకు శ్రీ నారాయణ మానవ ధర్మం ట్రస్ట్ ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేస్తూ..ఈ చట్టం భారతదేశంలో వక్ఫ్‌ను రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరకరమైన ఈ చట్టం వక్ఫ్ యంత్రాంగాన్ని మతేతర సంస్థగా పరిగణిస్తున్నదని పేర్కొన్నది. తద్వారా వక్ఫ్ ప్రాథమిక పాలక చట్టంగా ఇస్లామిక్ చట్టాన్ని పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో అభ్యంతరకరమైన చట్టాన్ని భర్తీ చేస్తున్నదని వాదించింది. ఇది ముస్లిం సమాజ ఉనికినే ప్రమాదంలోకి నెట్టివేస్తున్నదని తెలిపింది. వక్ఫ్ అనేది శతాబ్దాలుగా ఇస్లాం ఆచారాలు, దాని మనుగడకు అవసరమైన ఆర్థిక వనరులకు అత్యంత ముఖ్యమైనదిగా కొనసాగుతున్నదని పేర్కొన్నది. కొత్తగా తెచ్చిన సవరణ చట్టం.. ముస్లిం సమాజ ఆర్థిక పునాదులను దెబ్బతీస్తుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Universe End | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?
Revanth Reddy | రేవంత్.. ఢిల్లీ వెళ్లేది ఈ పనుల కోసమేనా?
Universe End | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?
Hyderabad: గోపనపల్లిలో భారీ ఐటీ పార్క్! కంచగచ్చిబౌలి వివాదంతో.. మరో ప్రాంతంపై సర్కార్ కన్ను