నీటిలో గంట పాటు గడపడమే మహా ఎక్కువ అనుకునే మనుషులకు భిన్నంగా పశ్చిమ బెంగాల్‌లోని ఓ బాలుడు మాత్రం రోజుల తరబడి నీటిలోనే గడుపుతుండటం ఆశ్చర్యం రేపుతుంది. ముర్షిదాబాద్‌కు చెందిన 16 ఏళ్ల ఇక్బాల్ షేక్ వారంలో ఏకంగా నాలుగైదు రోజులు నీటిలోనే గడుపుతున్నాడు. ఒక్కోసారి ఏడు రోజులపాటు రాత్రిపగలూ చెరువులో ఉంటున్నాడు. అతడి వింత ప్రవర్తన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
శరీరంలో తీవ్రమైన మంటగా ఉండటం వల్ల రోజంతా చెరువు నీటిలోనే గడుపుతున్నానని ఇక్బాల్ షేక్ చెబుతున్నాడు. నీటిలో ఉంటేనే ఉపశమనం కలుగుతుందని, బయటకు రాగానే మంట వస్తుందని అతడు చెబుతున్నాడు. రోజుల తరబడి నీటిలో ఉండటం వల్ల చర్మవ్యాధుల బారిన పడుతున్నాడు. జలుబు, దగ్గు వంటి ఇన్ఫెన్షన్ల బారిన పడుతున్నాడు. నీటిలో ఉన్నప్పుడు అతని వద్దకే ఆహారాన్ని అందిస్తున్నారు. తనను బాధిస్తున చర్మ వ్యాధి మంటలకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్నా.. ఫలితం లేకపోయిందని, ప్రైవేటులో చికిత్స చేయించుకునే స్థోమత లేదని ఇక్బాల్ కుటుంబసభ్యులు వాపోతున్నారు.
पैसे की मजबूरी इंसान को ना जीने देती है ना मरने देती है।
नाम – इकबाल शेख
उम्र – 16 वर्ष
पता – पश्चिम बंगाल मुर्शिदाबाद जिले के रहने वाले है।इकबाल पिछले 5 वर्ष से ज़्यादा तर पानी में रहते है, क्योंकि उनको चर्म रोग ही बीमारी है पैसा न होने के कारण वो अपना इलाज भी नहीं करवा पा… pic.twitter.com/AMKInKGHuq
— मनीष मिश्रा (@Sanatnimaneesh) August 10, 2026
