Bald Head | భర్తకు బట్టతల.. ఈ మొగుడు నాకొద్దంటూ పోలీసు స్టేషన్ మెట్లెక్కిన భార్య
తన భర్తకు బట్టతల ఉందంటూ నోయిడాలో ఓ ఇల్లాలు పోలీసు స్టేషన్ మెట్లెక్కింది. ‘తలపై వెంట్రుకలు లేని ఈ బట్టతల భర్త నాకొద్దు’ అంటూ ఫిర్యాదు చేసింది.
Bald Head | వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చెయ్యాలంటారు. ఇది ఓ సామెత. అలానే చాలా మంది ఏదో ఒక విషయం దాచి పెళ్లి పీటలెక్కుతుంటారు. పెళ్లైన తర్వాత మనం దాచిన అబద్ధం బయటపడితే ఇంకేమైనా ఉందా.. పెళ్లి కాస్తా పెటాకులు కాదూ..! అదే జరిగింది ఓ యువకుడి జీవితంలో. పెళ్లి కోసం తనకు ఉన్న బట్టతలను (Bald Head) దాచి వివాహమాడాడు. చివరికి చిక్కుల్లో పడ్డాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..? నోయిడాలోని గౌర్ సిటీ అవెన్యూ 1 నివాసి లవికా గుప్తాకు రెండేండ్ల క్రితం సన్యం జైన్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే, సన్యం జైన్‌కు బట్టతల. విగ్గుతో దాన్ని కవర్ చేసేవాడు. పెళ్లి చూపుల్లోనూ తనకు ఒత్తైన జుట్టు ఉన్నట్లు వధువు కుటుంబాన్ని నమ్మించి వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత ఈ విషయం బయటపడింది. ఇంకేముంది ‘తలపై వెంట్రుకలు లేని ఈ బట్టతల భర్త నాకొద్దు’ అంటూ భార్య లవికా గుప్తా పోలీసులను ఆశ్రయించింది.
పెళ్లి సమయంలో ఒత్తైన జుట్టు ఉందని తనను నమ్మించినట్లు ఆ ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ తన భర్త జైన్ పూర్తి బట్టతలతో ఉన్నాడని, హెయిర్ ప్యాచ్‌తో తన లోపాన్ని కవర్ చేస్తున్నాడని
పేర్కొంది. ఒక్క జుట్టు విషయంలోనే కాదూ.. రూపం, చదువు, ఆదాయం ఇలా అన్ని విషయాల్లోనూ అబద్ధాలు చెప్పి అత్తింటి వారు తనని మోసం చేశారంటూ వాపోయింది. పెళ్లైన కొన్నిరోజులకే భర్త తనను
శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడని, ప్రైవేట్ ఫొటోలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించింది. తనతో అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ చేయించడానికి కూడా ప్రయత్నించినట్లు
ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సన్యం జైన్‌తో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులపై బీఎన్ఎస్ కింద వివిధ సెక్షన్లతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి మనోజ్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలోనూ ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
Bluefin Tuna Fish | చేప ధర రూ.29 కోట్లంట..! ప్రయోజనాలు తెలిస్తే షాకే మరి
Horoscope | బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram