Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే మంచిది..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  • By: raj |    devotional |    Published on : Jan 07, 2026 7:08 AM IST
Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారు ప్ర‌యాణాలు వాయిదా వేస్తే మంచిది..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సౌభాగ్య ప్రాప్తి ఉంది. పట్టుదలతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. అవసరానికి సరిపడా ఆదాయ వనరులు సమకూరుతాయి. ఒక శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. సంతానం అభివృద్ధి పట్ల శ్రద్ధ వహిస్తారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు ఈ రోజు సాఫల్యకరమైన రోజు. మీ కృషికి, పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రతిభతో ఇతరులలో స్ఫూర్తి నింపి మార్గదర్శకంగా ఉంటారు. ఆర్థికంగా ఈ రోజు అత్యంత ఫలదాయకమైన రోజు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అందరినీ కలుపుకుని ముందుకు పోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. కొన్ని పరిస్థితులు సంకటంగా మారుతాయి. కీలక నిర్ణయాలు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయే ప్రమాదముంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అశాంతి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం లోపిస్తుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి కావాలంటే ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం అవసరం. మీ సామర్థ్యాలను నమ్మితే ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు పనిచేస్తాయి. ప్రభుత్వ, అధికారిక పనుల్లో ఆర్థిక లాభం పొందుతారు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. బుద్ధిబలం సకాలంలో పనిచేయడం వలన కీలక సమస్యలు సునాయాసంగా పరిష్కరిస్తారు. కుటుంబ విలువేంటో గ్రహిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ మృదువైన మాటలతో వివాదాలకు ముగింపు పలుకుతారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతమైనదిగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. వివిధ రంగాల్లో సాధించిన విజయాలు, ఆర్థిక లాభాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా, అదృష్టకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ యోగాలుంటాయి. మీ పనితీరు పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేస్తారు. వ్యాపారంలో ధనయోగాలుంటాయి. సామాజిక గుర్తింపు, పదోన్నతులకు అవకాశం ఉంది. ఒక శుభవార్త మీ ఆనందాన్ని పెంచుతుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మీ అధికార పరిధి విస్తరిస్తుంది. సంతాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారంలో సమస్యలు తొలగుతాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థికపరంగా నష్టాలు సంభవించవచ్చు. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా పాటించడం తప్పనిసరి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శత్రుభయం తొలగుతుంది. అన్ని రంగాల్లో అనుకూల పరిణామాలు ఉంటాయి. మీ పరోపకార పనులతో అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఆర్థికంగా సరైన ప్రణాళిక అవసరం. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. మొహమాటంతో ఖర్చులు పెరగవచ్చు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే సృజనాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాల కోసం నూతన వ్యూహాలు అనుసరించాలి. ముందస్తు ప్రణాళికా లోపంతో ఖర్చులు పెరుగుతాయి. బంధువులలో కొందరి ప్రవర్తన విచారం కలిగిస్తుంది.