Drugs: డ్రగ్స్ కేసులో NRI అరెస్టు.. భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం

విధాత : బేగంపేటలో నివసించే అమెరికా పౌరుడు తేజస్ కట్ట (29), సోహెల్ అహ్మద్ (29) డ్రగ్స్ విక్రయిస్తు పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్టు చేసి..వారి నుంచి 21 గ్రాముల ఓజీ కుష్, 32.5 గ్రాముల చెరస్, 56 గ్రాముల ఎల్ఎస్డి బ్లాస్టర్, రూ.లక్ష నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో డ్రగ్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్ దేశస్తులను నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12లక్షల విలువైన కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డ్రగ్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తుంది. నార్కోటిక్ బృందాలు, ఎస్వోటీ, స్పెషల్ టాస్క్ ఫోర్సు బృందాలు డ్రగ్ రాకెట్లపై నిఘా వేసి తరుచు మెరుపుదాడులు సాగిస్తున్నాయి. గంజాయి, డ్రగ్ అక్రమ రవాణ, అమ్మకాలపై ఉక్కు పాదం మోపుతున్నాయి.