Dimple Hayathi | వేణుస్వామితో రహస్యంగా పూజలు చేయించిన టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి..! ఇకనైనా జాతకం మారేనా..?
Dimple Hayathi | టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి. 2017లో ‘గల్ఫ్’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అభినేత్రి నటించింది. గద్దలకొండ గణేశ్‌లో ‘సూపర్ హిట్టు’ పాట నర్తించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడీలో నటించింది. అయితే, బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో నిరాశ తప్పలేదు. ఇటీవల గోపీచంద్ సరసన రామబాణంలో మెరిసింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్న ఆశించిన స్థాయిలో హైదరాబాద్ […]

Dimple Hayathi |
టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయతి. 2017లో ‘గల్ఫ్’ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అభినేత్రి నటించింది. గద్దలకొండ గణేశ్‌లో ‘సూపర్ హిట్టు’ పాట నర్తించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడీలో నటించింది.
అయితే, బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో నిరాశ తప్పలేదు. ఇటీవల గోపీచంద్ సరసన రామబాణంలో మెరిసింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్న ఆశించిన స్థాయిలో హైదరాబాద్ బ్యూటీకి విజయం దక్కలేదు.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోలు వదులుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికీ తెలిసిందే. ప్రముఖుల జాతకాలు, కెరీయర్ గురించి సంచలన విషయాలు చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు.
కొందరి విషయంలో చెప్పినట్లు జరుగుతుండడంతో చాలా మంది ఆయన సలహాలు, సూచనలు పాటిస్తుంటారు. పలువురు హీరోయిన్లు సైతం కెరీర్‌లో సక్సెస్ సాధించేందుకు ఆయనతో పూజలు చేయించుకున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, నిధి అగర్వాల్‌తో పాటు పలువురు ఇప్పటికే పూజలు చేయించారు.
తాజాగా ఈ జాబితాలో డింపుల్ హయతి సైతం చేరింది. హైదరాబాద్‌లోని తన ప్లాట్‌లో వేణుస్వామితో రహస్యంగా డింపుల్ హయతి పూజలు చేయించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కడం లేదు. అలాగే పోలీస్ అధికారితో గొడవ జరగడంతో హైకోర్టు దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేణుస్వామితో పూజలు చేయించినట్లు తెలుస్తుంది. మరి వేణుస్వామి చేసిన పూజలతో డింపుల్ హయతి జాతకం మారుతుందా? చూడాలి మరి..!