Ajith: హ్యాట్సాఫ్‌.. మొత్తానికి అజిత్ సాధించి.. చూపాడుగా

  • By: sr    news    Jan 12, 2025 10:19 PM IST
Ajith: హ్యాట్సాఫ్‌.. మొత్తానికి అజిత్ సాధించి.. చూపాడుగా

విధాత‌: తమిళ హీరో అజిత్‌కు బైక్ రేసులు, కారు రేసింగ్‌లు ఎంత ఇష్టమో అంద‌రికీ తెలిసిందే. త‌రుచూ ఇత‌ర దేశాల్లో పోటీల్లో పాల్గొంటూ త‌న తృష్ణ‌ను తీర్చుకుంటూ వ‌స్తున్నాడు.

ఇటీవ‌ల దుబాయ్ 24 హెచ్ కార్ రేస్‌లో తన టీంతో కలిసి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా జ‌రిగిన పోటీలో యాక్సిడెంట్‌కు గురై తృటిలో ప్రాణాప్రాయం నుంచి త‌ప్పుకున్న అజిత్ తాజాగా ఓ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు.

ఆదివారం జ‌రిగిన రేసులో అజిత్ టీం ఘ‌న విజ‌యం సాధించి భార‌త ప‌తాకాన్ని రెప‌రెలాడించారు. హోరా హోరిగా సాగిన ఈ రేసింగ్ లో ఆయన టీం 901 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచింది.

ఇటీవల జరిగిన ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన అజిత్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా రేసులో పాల్గొని విజయం సాధించారు. దీంతో ఆయనకు స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును అందించింది టీమ్. ఈ సందర్భంగా అజిత్ కు పలువురు సినీ ప్రముఖుల సోషల్ మీడియాలో అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.