Indo Pak War: పాక్ కాల్పుల్లో.. మరో జవాన్ వీరమరణం
విధాత: జమ్మూలో పాక్ దళాలతో జరిగిన పోరాటంలో మరో భారత వీర జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం పొందాడు. సచిన్ యాదవ్‌రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివ దేహం ఇవాళ స్వస్థలానికి చేరనుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన మురళీనాయక్ కూడా జమ్మూ లోనే పాక్ చొరబాటుదారుల కాల్పుల్లో అమరుడయ్యాడు. ఆయన అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వం అధికారిక, సైనిక లాంఛనాలతో ఘనంగా ఏర్పాట్లు చేసింది.
అంతకుముందు నియంత్రణ రేఖ వెంట పాక్ సైన్యం ఆకస్మిక కాల్పుల్లో భారత్ జవాన్ లాన్స్ నాయక్ దినేష్ కుమార్ అమరుడయ్యారు. హర్యానాలోని పల్వాల్ ఆయన స్వస్థలం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram