Apk File Scam|| మీ ఫోన్ కు ఏపీకే ఫైల్ వచ్చిందా.. అయితే తస్మాత్ జాగ్రత్త
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు పన్నే పన్నాగాలు అన్ని ఇన్నీ కావు, రోజుకో మార్గంలో అమాయక ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. మొన్నటి వరకు ఓటీపీలతో మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు తాజాగా ఏపీకే ఫైల్స్ తో బ్యాంకు ఖాతాలను లూటీ చేసేస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో ఏపీకే ఫైల్స్ వాట్సాప్ లు, మెసేజ్ ల రూపంలో పంపి అప్ డేట్ చేసుకునేందుకు దిగువన ఇచ్చిన ఏపీకే ఫైల్స్ ను ఇన్ స్టాల్ చేయమని, లేదంటే బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని చెబుతున్నారు.
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు పన్నే పన్నాగాలు అన్ని ఇన్నీ కావు, రోజుకో మార్గంలో అమాయక ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. మొన్నటి వరకు ఓటీపీలతో మోసాలకు పాల్పడ్డ కేటుగాళ్లు తాజాగా ఏపీకే ఫైల్స్ తో బ్యాంకు ఖాతాలను లూటీ చేసేస్తున్నారు. వివిధ రకాల బ్యాంకుల పేరుతో ఏపీకే ఫైల్స్ వాట్సాప్ లు, మెసేజ్ ల రూపంలో పంపి అప్ డేట్ చేసుకునేందుకు దిగువన ఇచ్చిన ఏపీకే ఫైల్స్ ను ఇన్ స్టాల్ చేయమని, లేదంటే బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని చెబుతున్నారు. దీంతో చాలా మంది వెంటనే డౌన్ లోడ్ చేస్తున్నారు. ఇంకేముంది.. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు ఖాతాలను సున్నార్పనం చేసేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఆదివారం వందల వాట్సప్ గ్రూప్స్ లో ఏపీకే ఫైల్స్ ప్రత్యేక్షమయ్యాయి. సాధారణ వాట్సప్ గ్రూప్స్ మాత్రమే కాకుండా జర్నలిస్టులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ గ్రూపుల్లో కూడా ప్రత్యక్షమయ్యాయి. ఈ గ్రూపుల్లో ఉన్నవారు ఎవరైనా వాటిపై క్లిక్ చేస్తే వారి ఫోన్ లో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ ఫైల్స్ చొరబడ్డాయి. ఈ విధంగా వేలాది గ్రూపుల్లో ఈ ఏపీకే ఫైల్స్ కనిపించడంతో అందరూ ఆందోళన చెందారు.
ఇలాంటి మోసాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలి, పొరపాటున నేరగాళ్లు పంపిన ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తే వెంటనే ఏం చేయాలో తెలుసుకుందాం.. Apk అంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ. వీటిని సాధారణంగా ఫోన్ లోని ప్లేస్టోర్ నుంచి కాకుండా తర్డ్ పార్టీ ద్వారా అప్లికేషన్స్ ను డౌన్ లోడ్ చేసుకునే ప్రక్రియ. కాబట్టి Apk అని ఉండే ఏ ఫైల్స్ ని కూడా ఎటువంటి పరిస్థుతులలో ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే మీ ఫోన్ డేటా పోవడమే కాకుండా మీకు తెలియకుండా మీ ఫోన్ ను సైబర్ నేరస్తులు ఆపరేట్ చేస్తారు. మీ ఫోన్లో ఉన్న డాటా, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు దొంగిలించ బడతాయి. ముఖ్యంగా RTO CHALLAN.apk, Aadhar.Apk, SBI.Apk, pm kisan.Apk, Unions Bank.Apk, Cse.Apk, Statebank.Apk, Ekyc apk పేర్లతో వస్తున్న ఫైల్స్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ కి గురవుతుంది. కాబట్టి వెంటనే వాటిని ఓపెన్ చేయకుండా డిలీట్ చేయాలి.
ఒకవేళ పొరపాటున ఇన్స్టాల్ చేసుకుంటే తక్షణమే ఇంటర్ నెట్ డేటా ఆఫ్ చేసి, సెట్టింగ్స్ లోని యాప్స్ లోకి వెళ్లి సదరు ఏపీకే యాప్ ను అన్ ఇన్స్టాల్ చేయాలి. యాంటీ వైరస్ యాప్తో ఫోన్ని ఫుల్ స్కాన్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకింగ్ యాప్లు, సామాజిక మాధ్యమాల ఎకౌంట్లు, ఈ- మెయిల్ ఎకౌంట్ పాస్వర్డులు వెంటనే మార్చాలి. మెసేజ్లు, కాలాగ్, బ్యాంకు లావాదేవీలు, ఈ-మెయిల్ లాగిన్లలో అనుమానాస్పద యాక్టివిటీ ఉందేమో పరిశీలించాలి. ఒకవేళ మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ అవ్వకపోతే, ఫోన్ని సేఫ్ మోడ్లో రీస్టార్ట్ చేసి అన్ఇన్స్టాల్ చేయాలి. అయినప్పటికీ కూడా అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే డేటా బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది. ఏదైనా మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే బ్యాంకు ఖాతా ను హోల్డ్ లో పెడితే మంచిది. ఆ తర్వాత 1930కి ఫోన్ చేసి మీకు జరిగిన నష్టం గురించి ఫిర్యాదు చేయాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram