సివిల్స్ ర్యాంకర్ అనన్యను కూడా వదలని సైబర్ నేరగాళ్లు
యూపీఎస్సీ-2023 సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డోనూరు అనన్య రెడ్డి సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ల బారిన పడింది
విధాత, హైదరాబాద్ : యూపీఎస్సీ-2023 సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డోనూరు అనన్య రెడ్డి సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ల బారిన పడింది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లలో తన పేరుపై నకిలీ ఖాతాలు సృష్టించారని ఆమెఈ నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ఛానెల్ లు తన పేరు మీద మెంటర్షిప్ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాయని, ఉద్యోగార్థుల నుంచి డబ్బు కూడా వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. సోషల్ మీడియాలో తన పేరుపై ఉన్న నకిలీ ఖాతాల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను అనన్య కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram