Brain ‘Stent’ | బ్రెయిన్ ద్వారా ఐఫోన్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో యాపిల్!
యాపిల్ కంపెనీ. తన ఐఫోన్ యూజర్లు బ్రెయిన్‌తోనే అంటే.. మనసుతోనే డివైస్‌ను కంట్రోల్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) కంపెనీ సింక్రాన్‌తో చేతులు కలిపింది. ఈ కంపెనీ మనుషుల మెదడులో అమర్చే చిప్‌ను తయారు చేసే పనిలో ఉన్నది.

Brain ‘Stent’ | ఎవరికో ఫోన్ చేయాలి. చేయాలంటే ఫోన్ ఓపెన్ చేయాలి.. అందులో పేరు వెతకాలి.. నంబర్ డయల్ చేయాలి. ఫోన్‌లో వాట్సాప్ సందేశం చదవాలంటే.. ఫోన్‌లో వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి.. అందులో మెసేజ్ చదవాలి. ఎక్కడికో రైల్ టికెట్ బుక్ చేయాలి.. అప్పుడూ అంతే! ఆన్‌లైన్‌లో షాపింగ్ మొదలు.. యూట్యూబ్‌లో వీడియోల వరకూ.. అన్నీ ఓపెన్ చేసి చూడాల్సిందే. అదే.. మనసులో అనుకున్నది ఫోన్ చేసేస్తే? అది ఎవరో కాల్ కావచ్చు.. ఆన్‌లైన్‌లో షాపింగ్ కావచ్చు.. సినిమా టికెట్లో, ట్రైన్ టికెట్లో బుక్ చేయడం కావచ్చు.. ఇలా అనుకోగానే.. అలా పని అయిపోతే? ఊహించడానికి బానే ఉన్నా సాధ్యమేనా? అంటారా? సాధ్యం చేసే పనిలో ఉంది.
యాపిల్ కంపెనీ. తన ఐఫోన్ యూజర్లు బ్రెయిన్‌తోనే అంటే.. మనసుతోనే డివైస్‌ను కంట్రోల్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) కంపెనీ సింక్రాన్‌తో చేతులు కలిపింది. ఈ కంపెనీ మనుషుల మెదడులో అమర్చే చిప్‌ను తయారు చేసే పనిలో ఉన్నది. ఇది మెదడు సంకేతాలను గుర్తించే ఎలక్ట్రాడ్‌లను కలిగి ఉంటుంది. ఈ మేరకు యాపిల్ కంపెనీ ఒక ప్రకటన చేసింది. సింక్రాన్ అందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆ సంకేతాలను చర్యలుగా యాపిల్ మార్చుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పుడు యూజర్ మనసులో ఏది అనుకుంటే దానిని ఫోన్ చేసేస్తుంది. మీరు ఏదైనా స్పెసిఫిక్ యాప్‌ను ఓపెన్ చేయాలనుకుంటూ దాని గురించి ఆలోచన చేయగానే.. ఆ యాప్ తెరుచుకుంటుంది.
ఈ చిప్ ప్రయోగాత్మక దశలో ఉన్నది. ప్రత్యేకించి కాళ్లు, చేతులు ఉపయోగించలేని స్థితిలో ఉన్నవారికి ఇది బాగా పనికివస్తుంది. దీనికి సంబంధించిన ఒక కథనాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఈ సాంకేతికతపై యాపిల్, సింక్రాన్ కంపెనీలు టెస్టర్లతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించింది. వారిలో పిట్స్‌బర్గ్‌కు చెందిన మార్క్ జాక్సన్ ఒకరు. ఆయన బ్రెయిన్, వెన్నుపూస సంబంధిత నరాల బలహీనతతో బాధపడుతున్నారు. ఆయనపై పరీక్షలు జరుగుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
ఈ చిప్.. సాధారణంగా గుండె ఆపరేషన్‌లలో అమర్చే స్టెంట్ తరహాలో ఉంటుంది. దీనిని బ్రెయిన్‌లోని మోటర్ కోర్టెక్స్‌పైన రక్తనాళంలో ప్రవేశపెడతారు. ఆ డివైస్.. మెదడు తరంగాలను కార్యాచరణగా సమర్థంగా మార్చుతుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. యూజర్ మనసులో అనుకోగానే.. కోరుకున్న ఐకాన్ స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతుంది. ఈ పరీక్షలు, ప్రయోగాలు సక్సెస్ అయితే.. శరీరం చచ్చుబడిపోయినవారికి ఎంతో ఉపకరిస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కూడా ఇదే తరహా టెక్నాలజీపై పనిచేస్తున్నది. ఇప్పటికే మాటలు పలకడానికి సమస్యలు ఎదుర్కొనేవారి కోసం యాపిల్ తన ఐవోఎస్19లో పర్సనల్ వాయిస్ యాక్సెసిబిలిటీ ఫీచర్‌ను అప్‌గ్రేడ్ చేసింది.