రజతోత్సవ వేడుకలు టీఆర్ఎస్ పార్టీకీ చేస్తున్నారా లేక బీఆర్ఎస్‌కా?: ఎంపీ చామల

  • By: sr    news    Apr 21, 2025 5:32 PM IST
రజతోత్సవ వేడుకలు టీఆర్ఎస్ పార్టీకీ చేస్తున్నారా లేక బీఆర్ఎస్‌కా?: ఎంపీ చామల

విధాత: కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వడం చారిత్రక అవసరం అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీ భవన్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మరోసారి మీ నాయన సీఎం కావాల్సిన అవసరం ఏంటో కేటీఆర్ చెప్పాలని..లక్ష కోట్లతో కూలిపోయే కాళేశ్వరం కట్టినందుకా? రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టినందుకా? మిగులు రాష్ట్రంగా మీ చేతిలో పెడితే.. అందినకాడికి దోచుకొని అప్పుల రాష్ట్రంగా మార్చినందుకా? అని నిలదీశారు. బహుశా రాష్ట్రాన్ని దోచుకోవడంలో టార్గెట్ ఇంకా పూర్తికాలేదా? అందుకే అధికారం కోసం ఆరాటపడుతున్నారా? అని చామల ఎద్దేవా చేశారు.

రజతోత్సవ వేడుకలు టీఆర్ఎస్ కు చేస్తున్నారా లేక బీఆర్ఎస్ కు చేస్తున్నారా..? ముందుగా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 2001లో పుట్టిన టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గా మారిందని..రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత దేశాన్ని దోచుకునే ఆలోచనతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని చామల ఆరోపించారు. పార్టీ పేరు మార్చి రజతోత్సవాలు జరుపుకోవడానికి సిగ్గు ఉండాలని ఎద్దేవా చేశారు. అసలు టీఆర్ఎస్ ఆవిర్భావం సమయంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఎక్కడున్నారని? ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్, కవిత అమెరికాలో ఉన్నారని..నేను నా ముసలామే మాత్రమేనని చెప్పిన కేసీఆర్ పార్టీని కుటుంబ పార్టీగా మార్చి పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని చామల విమర్శించారు. పిట్టల దొర కేసీఆర్ రిటైర్ అయ్యి ఫామ్ హౌస్ లో ఉంటుండగా..తుపాకీ రాముడు కేటీఆర్, రబ్బర్ చెప్పుల హరీష్, లిక్కర్ కవిత, హ్యాపీ రావు తప్ప పార్టీ ప్రారంభించిన తొలినాళ్లలో ఉన్న వారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉన్నారంటూ చామల విమర్శించారు.