నేరేడు( జామున్) పండ్లు మనకు ముందస్తు కరవు హెచ్చరికలు అందిస్తాయా..? ఈ సంవత్సరం తీవ్ర కరువు రానుందని..నేరేడు చెట్ల కరువు హెచ్చరిక చేస్తున్నాయంటున్నారు కొందరు సాంప్రదాయవాదులు. ఏ వేసవి సీజన్ లోనైతే నేరేడు చెట్లు ఎక్కువగా విరగకాసి చెట్ల నుంచి పండ్లు రాలుస్తాయో..ఆ ఏడాది కరువు వచ్చే అవకాశం ఉంటుందంటూ ఓ సాంప్రదాయ కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్వం అమ్మమ్మలు తమ మాటల్లో నేరుడు పండ్ల కరవు హెచ్చరికల కథను చెప్పే వారంటూ ఈ కథనంలో ప్రస్తావించడం విశేషం. ఎలినినో హెచ్చరికల నేపథ్యంలో నేరడు పండ్ల కరువు కథనం మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ సంవత్సరం మార్కెట్లలో గత ఎన్నో సంవత్సరాల కంటే ఎక్కువగా నేరేడ పండ్లు కనిపిస్తున్నాయి. చెట్ల నుంచి కూడా విపరీతంగా పండ్లు రాలుతున్నాయి. Plant Science ప్రకారం దీనిని Masting లేదా Stress Fruiting అంటారు. కొన్ని సందర్భాల్లో Suicide Fruiting లేదా Bumper Crop అని కూడా పిలుస్తారట. చెట్టు భూగర్భ జలాలు తగ్గుతున్నాయని లేదా వాతావరణంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని గుర్తిస్తే, తన శక్తినంతా కొత్త కొమ్మలు, ఆకుల పెరుగుదలపై కాకుండా పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై కేంద్రీకరిస్తుందని ఈ పోస్టు కథనం.
నేరేడు చెట్లకు లోతుగా వెళ్లే Taproot System ఉంటుంది. భూగర్భ జలమట్టం బాగా పడిపోయినప్పుడు ఈ వేర్లు Water Stress ను అనుభవిస్తాయి. ఇది రాబోయే కరువు లేదా తీవ్రమైన వేసవికి సంకేతంగా పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారు. అందుకే వేసవిలో నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాస్తే, అది ప్రకృతి నుంచి వచ్చే ఒక కరువు హెచ్చరిక కావచ్చని అంటున్నారు. ఈ పరిణామం చెట్టు “ఆత్మహత్య” చేసుకోవడంగా కాకుండా..తన జాతి కొనసాగేందుకు తదుపరి తరానికి ఎక్కువ విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తున్నట్లుగా భావించాలని ఆ పోస్టు పేర్కొంటుంది.
ఈ సంవత్సరం నేరేడు పండ్లు ఎక్కువగా దిగుబడి అవుతున్నాయంటే…కరువు సంకేతాలుగా భావించి నీరు వంటి సహజ వనరులను పొదుపుగా, బాధ్యతతో ఉపయోగించాల్సిన అవసరాన్న గుర్తుచేసుకోవాలని పూర్వీకుల కథనంగా చెబుతున్నారు. మార్కెట్లో గింజ పెద్దగా ఉండే నాటు నేరేడు పండ్ల దిగుబడి ఎక్కువగా కనిపిస్తుంటే.. అది వాతావరణ ఒత్తిడి వల్ల నేరేడు పండ్లు చేసే కరువు సూచనేనంటున్నారు. పెద్ద సైజులో, ఎక్కువ గుజ్జుతో హైబ్రిడ్ పండ్లు కనిపిస్తుంటే మాత్రం అవి వాణిజ్య సాగు దిగుబడిగా పరిగణించాలంటున్నారు సాంప్రదాయవాదులు.
ఇదంతా అశాస్త్రీయ వాదన
నేరేడు చెట్లు కొన్ని పరిస్థితుల్లో ఎక్కువ పండ్లు కాయడం (Masting) శాస్త్రీయంగా గుర్తించిన విషయమేనని, అయితే దానిని ఈ ఏడాది తీవ్ర కరువు వస్తుందనే ఖచ్చితమైన సూచికగా చెప్పేందుకు ప్రస్తుతం బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని కొందరు నెటిజన్లు కొట్టిపారెస్తున్నారు. ప్రకృతి సంకేతాలను గమనించడం మంచిదే, అయితే కరువు అంచనాలకు వాతావరణ, వర్షపాతం, భూగర్భ జలాల వంటి అనేక డేటాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. మరికొందరు మాత్రం గతంలో నేరేడు పండ్లు ఎక్కువగా పండినప్పుడు వర్షాలు బాగానే పడిన సంగతిని గుర్తు చేస్తున్నారు.
మరికొందరు మాత్రం ఎలినినో హెచ్చరికలు సెంటిఫిక్ థియరీ అయితే…నేరేడు చెప్పే కరువు సంకేతాలను ప్రకృతి నుంచి పూర్వీకులు గ్రహించిన సాంప్రదాయ సూచనలుగా చూసి జాగ్రత్త పడితే తప్పేం లేదంటున్నారు.
ఈ సంవత్సరం తీవ్ర కరువు రానుందా..?
***********************************గమనిక: ఈ సిద్ధాంతానికి (Theory) పూర్తి scientific backing ఉందో లేదో నాకు తెలియదు. ఆసక్తికరమైన సమాచారం అనిపించి షేర్ చేస్తున్నాను..
జామున్ (నేరేడు) పండ్లు మనకు హెచ్చరిక చేస్తున్నాయా?
ఈ సంవత్సరం మార్కెట్లలో గత… pic.twitter.com/VGLmXfS7JS
— RAKESH BURUGULA🇮🇳 (@RakeshBurugula) June 18, 2026
